📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

North Korea: రష్యాకు సైనికులను పంపినట్లు అంగీకరించిన ఉత్తర కొరియా

Author Icon By Vanipushpa
Updated: April 28, 2025 • 11:44 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరఫున ఉత్తర కొరియా సైనికులు పాల్గొంటున్నారంటూ గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పటివరకు దీనిపై ఇటూ రష్యా, అటూ ఉత్తరకొరియా రెండు దేశాలు స్పందించలేదు. అయితే, దీనిపై తొలిసారిగా నార్త్ కొరియా స్పందిస్తూ, రష్యాకు తమ సైనికులను పంపించినట్లు అంగీరించింది. ఈ విషయాన్ని ఉత్తర కొరియా అధికారిక మీడియా సంస్థకు సోమవారం అందించిన ఒక ప్రకటనలో పేర్కొంది. పరస్పర రక్షణ ఒప్పందం కింద యుద్ధసైనికులను రష్యాకు పంపించాలని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్​ నిర్ణయించినట్లు ప్రకటనలో ఉంది. ఉక్రెయిన్ నయా-నాజీ ఆక్రమణదారుల విధానాలను అమలు చేస్తూ ఆక్రమించిన కుర్స్క్ ప్రాంతాన్ని విముక్తి చేయడానికి రష్యన్ సాయుధ దళాలకు సహకరిస్తూ సైన్యాన్ని మోహరించామని తెలిపింది. న్యాయం కోసం పోరాడిన వారందరూ మాతృభూమి గౌరవానికి ప్రతినిధులు, వీరులని కిమ్ పేర్కొన్నట్లు ప్రకటనలో ఉంది.

పుతిన్‌, కిమ్‌తో పలు ద్వైపాక్షిక ఒప్పందాలు
ఇటీవల కర్స్క్‌లో ఉక్రెయిన్​ను తిప్పికొట్టే క్రమంలో ఉత్తర కొరియా సైనికులు తమతో కలిసి పని చేశారని ఈ క్రమంలో వారు ధైర్యసాహసాలను ప్రదర్శించారని రష్యా సాయుధ బలగాల చీఫ్‌ ఆఫ్‌ జనరల్‌ స్టాఫ్‌ గెరాసిమోవ్‌ స్పష్టం చేశారు. గతేడాది జూన్‌లో ప్యాంగ్‌యాంగ్‌ పర్యటనకు వెళ్లిన పుతిన్‌, కిమ్‌తో పలు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. పలు ఒప్పందాలపై సంతకం చేశారు. యుద్ధం జరిగినప్పుడు రెండు దేశాలు సైనికపరంగా ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ముందుకు రావాలని హామీ ఇచ్చారు.
300 ఉత్తర కొరియా సైనికులు మరణించారు
యుద్ధంలో పాల్గొనేందుకు దాదాపు 10,000-12,000 మంది సైనికులను రష్యాకు పంపినట్లు అమెరికా, దక్షిణ కొరియా, ఉక్రెయిన్ నిఘా అధికారులు తెలిపారు. కాగా, దక్షిణ కొరియా జాతీయ ఇంటెలిజెన్స్ సర్వీస్ (NIS) ప్రకారం జనవరిలో సుమారు 300 ఉత్తర కొరియా సైనికులు మరణించగా, మరో 2,700 మంది గాయపడ్డారని తెలిపింది. అయితే మృతులు, గాయపడిన వారి సంఖ్య దాదాపు 4,000 వరకు ఉంటుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్​ స్కీ అన్నారు.

అయితే అమెరికా అంచనాల ప్రకారం ఆ సంఖ్య సుమారు 1,200గా ఉంది. ఉత్తర కొరియా ప్రకటనలో, కుర్స్క్ ప్రాంతం విముక్తి కోసం తమ సైనికులు రష్యన్ సాయుధ బలగాలతో కలిసి పని చేశారని తెలిపింది. కిమ్ జంగ్ ఉన్ ప్రకారం, “న్యాయం కోసం పోరాడుతున్న వారందరూ మాతృభూమి గౌరవానికి ప్రతినిధులు, వీరులు” అని పేర్కొన్నాడు. గతేడాది జూన్‌లో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్యాంగ్‌యాంగ్‌ పర్యటనలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్‌తో పలు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాలు యుద్ధ సమయంలో రెండు దేశాలు ఒకరికొకరు సైనిక సహాయం అందిస్తాయని హామీ ఇచ్చాయి. ఉత్తర కొరియా, రష్యాకు సైనికులను పంపించడంపై మొదటి సారి అధికారికంగా అంగీకరించింది. ఈ చర్య, ఉత్తర కొరియా-రష్యా మధ్య ఉన్న పరస్పర రక్షణ ఒప్పందం ప్రకారం, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను సహకరించడం ఉంది.

Read Also: Phalgam Terror Attack: పహల్గామ్‌ ఉగ్రదాడితో సంబంధం లేదన్న పాకిస్థాన్ స్పందించిన ఒమర్ అబ్దుల్లా

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu North Korea admits Paper Telugu News sending troops to Russia Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.