हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Mohsen: అణు శాస్త్రవేత్త మొహసెన్ ఫఖ్రిజాదే హత్య వెనుక మొస్సాద్!

Vanipushpa
Mohsen: అణు శాస్త్రవేత్త మొహసెన్ ఫఖ్రిజాదే హత్య వెనుక మొస్సాద్!

ఇరాన్ అణు కార్యక్రమ పితామహుడు

మళ్లీ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదే ఇరాన్(Iran) అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్త మొహసెన్ ఫఖ్రిజాదే(Mohsen Fakhrizadeh) హత్య. ఈ ఘటన అప్పట్లో అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. మొహసెన్ ఫఖ్రిజాదే చాలా సంవత్సరాల పాటు అత్యంత రహస్య వ్యక్తిగా మిగిలిపోయారు. 2000వ దశకం ప్రారంభంలో ఇరాన్ రహస్యంగా అణుబాంబును నిర్మించడానికి చేపట్టిన “ప్రాజెక్ట్ అమాద్” వెనుక ఈయనే ముఖ్య సూత్రధారి అని పాశ్చాత్య నిఘా వర్గాలు భావించాయి. ఆయన బహిరంగంగా ఎప్పుడూ కనిపించలేదు, ఆయన ఫోటోలు కూడా చాలా అరుదుగా లభ్యమయ్యేవి. పాశ్చాత్య నిఘా సంస్థలు, ఇజ్రాయెల్(Israel) అధికారులు ఫఖ్రిజాదేను “ఇరాన్ అణు కార్యక్రమ పితామహుడు”గా అభివర్ణించేవారు. 2018లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇరాన్‌కు చెందిన అణు దస్త్రాలను బహిర్గతం చేస్తూ, ఫఖ్రిజాదే పేరును ప్రస్తావించి “ఈ పేరు గుర్తుంచుకోండి” అని వ్యాఖ్యానించారు.

Mohsen: అణు శాస్త్రవేత్త మొహసెన్ ఫఖ్రిజాదే హత్య వెనుక మొస్సాద్!
Mohsen: అణు శాస్త్రవేత్త మొహసెన్ ఫఖ్రిజాదే హత్య వెనుక మొస్సాద్!

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హత్య..
2020 నవంబర్ 27న మొహసెన్ ఫఖ్రిజాదే తన భార్య, బాడీగార్డులతో కలిసి టెహ్రాన్‌కు తూర్పున ఉన్న అబ్సార్డ్ పట్టణంలోని తమ విల్లాకు కారులో ప్రయాణిస్తున్నారు. మార్గమధ్యంలో, రోడ్డు పక్కన వదిలేసినట్లుగా ఉన్న ఓ పికప్ ట్రక్కులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 7.62 ఎంఎం ఎఫ్ఎన్ ఎంఏజీ మెషిన్ గన్‌ను అమర్చారు. దీనికి ఫేషియల్ రికగ్నిషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ లింకులు, పేలుడు పదార్థాలు కూడా జోడించారు. ఫఖ్రిజాదే కాన్వాయ్ ఒక స్పీడ్ బంప్ వద్ద వేగాన్ని తగ్గించగానే, ఆ మెషిన్ గన్ ఒక్కసారిగా తూటాల వర్షం కురిపించింది.

దాక్కునే ప్రయత్నం చేసినా..
మొదట కారు ముందు భాగంలో బుల్లెట్లు తగలగా, రెండో రౌండ్ కాల్పుల్లో విండ్‌షీల్డ్ పగిలి, ఫఖ్రిజాదే భుజంలోకి కనీసం ఒక బుల్లెట్ దూసుకెళ్లింది. ఆయన కారు దిగి డోర్ వెనుక దాక్కునే ప్రయత్నం చేయగా, మరో మూడు బుల్లెట్లు ఆయన వెన్నెముకలోకి దూసుకెళ్లి అక్కడికక్కడే కుప్పకూలారు. ఈ ఘటనలో ఆయన భార్యకు ఎలాంటి గాయాలు కాలేదు. మొత్తం 15 బుల్లెట్లు పేలగా, నిమిషం లోపే ఈ ఆపరేషన్ పూర్తయిందని ఇరాన్ అధికారులు తెలిపారు.

మొస్సాద్‌పై ఇరాన్ ఆరోపణలు
ఈ మొత్తం ఆపరేషన్, నిఘా నుంచి హత్య వరకు, ఇజ్రాయెల్ విదేశీ గూఢచార సంస్థ మొస్సాద్ పనేనని ఇరాన్ ఆరోపించింది. ఇజ్రాయెల్ అధికారికంగా బాధ్యత వహించనప్పటికీ, మొస్సాద్ మాజీ చీఫ్ యోస్సీ కోహెన్ తర్వాత కాలంలో ఫఖ్రిజాదే సరైన లక్ష్యమేనని సూచనప్రాయంగా వ్యాఖ్యానించారు. నెలల తరబడి నిఘా పెట్టి, ఆయుధ భాగాలను రహస్యంగా ఇరాన్‌లోకి తరలించి, అక్కడే అమర్చి ఈ హత్యకు పాల్పడినట్లు సమాచారం.

Read Also: Virat Kohli: లండ‌న్‌లోని కోహ్లీ ఇంట్లో గడిపిన భారత క్రికెటర్లు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870