Marco Rubio : ఇరాన్ యుద్ధం త్వరలో ముగుస్తుంది- రూబియో

Follow Us: Google News Daily Hunt
Marco Rubio
Marco Rubio
FONT SIZE
GET APP

Marco Rubio : ఇరాన్‌పై కొనసాగుతున్న సైనిక చర్యలు త్వరలోనే ముగియనున్నాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. నెలల తరబడి యుద్ధం కొనసాగదని, కేవలం కొన్ని వారాల్లోనే అమెరికా తమ ప్రధాన సైనిక లక్ష్యాలను సాధించగలదని ఆయన పేర్కొన్నారు.

ఇరాన్ సైనిక సామర్థ్యంపై దాడులు

‘గుడ్ మార్నింగ్ అమెరికా’ కార్యక్రమంలో మాట్లాడిన రూబియో, ప్రస్తుతం ఇరాన్ వైమానిక దళం, నౌకాదళం మరియు క్షిపణి సామర్థ్యాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నామని చెప్పారు. ఇరాన్ అణ్వాయుధాలను సంపాదించకుండా అడ్డుకోవడమే ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో క్షిపణులు, డ్రోన్లు తయారు చేయకుండా వారి రక్షణ పరిశ్రమలను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నామని తెలిపారు.

దౌత్యానికి ప్రాధాన్యం

ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దౌత్యపరమైన పరిష్కారానికే ప్రాధాన్యం ఇస్తున్నారని రూబియో తెలిపారు. మధ్యవర్తుల ద్వారా ఇరాన్‌తో సంప్రదింపులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇరాన్ నాయకత్వంలో అంతర్గత విభేదాలు ఉన్నాయని, కొందరు నాయకులు ప్రైవేట్‌గా చర్చలకు ఆసక్తి చూపుతున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

Read Also: 16th India Census 2026: సహజీవన జంటలకు ‘కుటుంబ’ హోదా

Marco Rubio
Marco Rubio

హర్మూజ్ జలసంధిపై హెచ్చరిక

ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హోర్ముజ్ జలసంధి ను నియంత్రిస్తామని ఇరాన్ చేస్తున్న హెచ్చరికలను రూబియో తీవ్రంగా ఖండించారు. అలాంటి పరిస్థితి ఎప్పటికీ అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలోని అనేక ఉగ్రవాద సంస్థలకు ఇరాన్ మద్దతు ఉందని కూడా ఆరోపించారు.

ఇరాన్ ప్రజలు గొప్పవారు

ఇరాన్ ప్రజల గురించి మాట్లాడిన రూబియో, వారు గొప్పవారని అన్నారు. అయితే వారి నాయకత్వమే సమస్య అని వ్యాఖ్యానించారు. దౌత్య ప్రయత్నాలు విఫలమైతే ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు మరింత తీవ్రతరం కావచ్చని అమెరికా ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు