📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Canada elections: కెనడా ఎన్నికల్లో లిబరల్ పార్టీ ప్రభంజనం

Author Icon By Vanipushpa
Updated: April 29, 2025 • 10:59 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కెనడా సాధారణ ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఆ పార్టీ హవా వీచింది. తన అధికారాన్ని నిలబెట్టుకుంది. ఆ దేశ ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ కొనసాగనున్నారు. వరుసగా రెండోసారి ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కెనడా 45వ ప్రధానమంతి కానున్నారు.
అధికార లిబరల్, ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీల మధ్య పోటీ
343 స్థానాలు ఉన్న కెనడా పార్లమెంట్‌లో అధికారంలోకి రావడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 172. అధికార లిబరల్, ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీల మధ్య ప్రధానంగా ఎన్నికల సమరం కొనసాగింది. ది న్యూ డెమొక్రటిక్ పార్టీ, బ్లాక్ క్యుబెకాయిస్, గ్రీన్ పార్టీ.. తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. మొత్తం 28 మిలియన్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ట్రంప్ వ్యతిరేకత లాభాన్ని ఇచ్చింది
తాజాగా చేపట్టిన ఓట్ల లెక్కింపులో లిబరల్ పార్టీ హవా కనింపించింది. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ భారీ మెజారిటీని అందుకుంటోంది. లిబరల్ నేత, ప్రస్తుత ప్రధాని మార్క్ కార్నీ, కన్జర్వేటివ్ నాయకుడు పియరీ పోయిలివ్రే, ఎన్డీపీ చీఫ్ జగ్మీత్ సింగ్, బ్లాక్ క్యూబెకోయిస్ అధినేత వైవ్స్-ఫ్రాంకోయిస్ బ్లాంచెట్, గ్రీన్ పార్టీ అధ్యక్షుడు జొనాథన్ పెడ్నాల్ట్ ఆధిక్యత సాధించారు. కెనడా ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మారారు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆ దేశం విధించిన టారిఫ్, అమెరికాలో 51వ రాష్ట్రంగా పరిగణిస్తామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మలచుకుంది లిబరల్ పార్టీ. మాజీ ప్రధాని జస్టిన్ ట్రుడో హయాంలో చెలరేగిన వ్యతిరేకతను సైతం ఇది రూపుమాపేలా చేసింది. జస్టిన్ ట్రుడో హయాంలో భారత్‌- కెనడా మధ్య తీవ్ర విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యోదంతంలో భారత్ ప్రమేయం ఉందంటూ స్వయానా ఆయన చేసిన ప్రకటనలు దుమారం రేపాయి. ఆయనపై తీవ్ర వ్యతిరేకత చెలరేగడానికీ దారి తీసిందీ ఉదంతం.
వరుసగా నాలుగోసారి అధికారం
అలాంటి కఠిన పరిస్థితులను కూడా అవలీలగా అధిగమించగలిగింది లిబరల్ పార్టీ. వరుసగా నాలుగోసారి అధికారంలోకి వచ్చింది. ఓ పార్టీ వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావడం అనేది కెనడా చరిత్రలో ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్, ఆయన చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా లిబరల్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించినట్టయింది.

Read Also: Europe : చీకటి మయంగా మారిన యూరప్ దేశాలు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu in Canadian elections Latest News in Telugu Liberal Party Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today wins

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.