हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Iran: మీకు తెలుసా! ఇరాన్ తొలి సుప్రీం లీడర్ మూలాలు భారత్‌లో..

Vanipushpa
Iran: మీకు తెలుసా! ఇరాన్ తొలి సుప్రీం లీడర్ మూలాలు భారత్‌లో..

ఇరాన్ తొలి సుప్రీం లీడర్, ‘ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్’ వ్యవస్థాపకుడు అయతుల్లా రూహుల్లా ఖుమేనీ(ayatollah ruhollah khomeini) పూర్వీకులు భారత్‌(India)కు చెందినవారు. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషన్‌(Iran Islamic Revolution)కు పితామహుడిగా పిలిచే అయతుల్లా రూహుల్లా ఖుమేనీ తాత ‘సయ్యద్ అహ్మద్ ముసావీ హిందీ’ భారత్‌లోని ఒక చిన్న గ్రామంలో 1790 ప్రాంతంలో జన్మించారు. రూహుల్లా ఖుమేనీ తాతకు 40 ఏళ్ల వయసున్నప్పుడు అవధ్ నవాబుతో కలిసి ఆయన ఇరాక్ ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లారు. అక్కడి నుంచి ఇరాన్‌(Iran)లో పలు ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించి, ఇరాన్‌లోని ఖొమైన్ అనే గ్రామంలో స్థిరపడ్డారు. కానీ, తన భారతీయ మూలాలు గుర్తు చేసుకునేలా ఇంటి పేరులో ‘హిందీ’ని కొనసాగించారు. ఆయన పెద్ద కొడుకు ‘అయతుల్లా ముస్తాఫా హిందీ’ ఇస్లాంకు సంబంధించి గొప్ప పండితుల్లో ఒకరిగా మారారు.

Iran: మీకు తెలుసా! ఇరాన్ తొలి సుప్రీం లీడర్ మూలాలు భారత్‌లో..
Iran: మీకు తెలుసా! ఇరాన్ తొలి సుప్రీం లీడర్ మూలాలు భారత్‌లో..

ఇస్లామిక్ రిపబ్లిక్
రూహుల్లా జన్మించిన ఐదు నెలలకు ఆయన తండ్రి సయ్యద్ ముస్తాఫా హిందీ హత్యకు గురయ్యారు. ముస్తాఫా హిందీ మరణించడంతో రూహుల్లాను ఆమె తల్లి, అత్తయ్య పెంచారు. ఆయన తన పెద్దన్న ముర్తాజా పర్యవేక్షణలో ఇస్లామిక్ విద్య నేర్చుకున్నారు. రూహుల్లా ఖుమేనీకి ఇస్లామిక్ న్యాయశాస్త్రం, షరియాపై ప్రత్యేక ఆసక్తి ఉంది. దీంతో పాటు ఆయన పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని కూడా అధ్యయనం చేశారు. ఇరాన్ నగరాలు అరాక్, ఖోమ్‌లలో ఇస్లామిక్ విద్యా సంస్థలలో చదువుకోవడమే కాకుండా అక్కడ బోధించారు కూడా. ఆ సమయంలో ఆయన రాచరిక వ్యవస్థను వ్యతిరేకించడం ప్రారంభించారు. దానిస్థానంలో విలాయత్-ఎ-ఫకీహ్ (మతనాయకుడి సార్వభౌమాధికారం)గా పిలిచే వ్యవస్థను సమర్థించడం మొదలుపెట్టారు.
ఖుమేనీని భారతీయ సంతతికి చెందిన ‘ ముల్లా’ గా గుర్తింపు
దీంతో ఖుమేనీని భారతీయ, బ్రిటిష్ ఏజెంట్‌గా చూపించేందుకు 1978 జనవరి 7న ఇత్తెలాత్ వార్తా పత్రిక.. ఖుమేనీని భారతీయ సంతతికి చెందిన ‘ ముల్లా’ గా పేర్కొంది. బ్రిటిష్-ఇండియన్ కాలనీకి చెందిన బంటుగా ఖుమేనీని పేర్కొంది. ఈ కథనం ప్రచురితమైన తర్వాత ఇరాన్ రివల్యూషన్ మరింత తీవ్రమైంది. ఈ విప్లవం ముగిసేలా లేదని గుర్తించిన తర్వాత పహ్లావి రాజ్యానికి చెందిన రెండో రాజు ఆర్యమెహర్ మొహమ్మద్ రెజా పహ్లావి 1979 జనవరి 16న దేశం విడిచి విదేశాలకు వెళ్లిపోయారు. ఆ తర్వాత 15 రోజులకు ఖుమేనీ సుమారు 14 ఏళ్ల తర్వాత 1979 ఫిబ్రవరి 1న ఇరాన్‌కు తిరిగి వచ్చారు. ఖుమేనీ ఇరాన్‌కు తిరిగి వచ్చిన తర్వాత రాచరిక వ్యవస్థ స్థానంలో ఇస్లామిక్ రిపబ్లిక్‌ను స్థాపించారు.
ఖుమేనీ సూఫీ దృక్ఫథం
తన రాజకీయ జీవితంలో ఖుమేనీ ప్రత్యేక గుర్తింపు పొందారు. ‘తూర్పు దేశాలతో, పశ్చిమ దేశాలతో సంబంధం లేదు, ఇస్లామిక్ రిపబ్లిక్‌తో మాత్రమే మాకు సంబంధం’, ‘ అమెరికాకు కూడా ఎలాంటి అధికారం లేదు’ వంటి కీలకమైన వ్యాఖ్యలను చేసేవారు. రూహుల్లా హిందీ పేరుతో ఇర్ఫానా గజల్స్‌ను ఆయన రాసేవారు. తన గజల్స్‌లో సాకి, వైన్, మద్యం, విగ్రహం ఆయన ఆధ్యాత్మిక గమ్యస్థానాలుగా పరిగణించే వారు. 1980 జులై 27న ఇరాన్ చక్రవర్తి ఆర్యమెహర్ మొహమ్మద్ రెజా పహ్లావి దేశానికి దూరంగా తన చివరి శ్వాసను విడిచారు. ఆ తర్వాత తొమ్మిదేళ్లకు 1989 జూన్ 4న అయతుల్లా రూహుల్లా ఖుమేనీ కూడా మృతి చెందారు.
రుహోల్లా మరణం తర్వాత సుప్రీం నేతగా అయతొల్లా అలీ ఖమేనీ
86 ఏళ్ల వయసులో సుప్రీం లీడర్ రుహోల్లా ముసావి ఖమేనీ మరణం తర్వాత, 1989లో ఆయన వారసుడిగా అయతొల్లా అలీ ఖమేనీని మతపెద్దలు ఎంపిక చేశారు. అయతొల్లా అలీ ఖమేనీ 1939లో ఇరాన్‌లో రెండో అతిపెద్ద నగరమైన మషాద్‌లో పుట్టారు. షా మొహమ్మద్ రెజా పహ్లావికి వ్యతిరేకంగా రుహోల్లా అయతొల్లా ఖమీని ప్రారంభించిన మత పోరాటంలో 1962లో అయతొల్లా అలీ ఖమేనీ కూడా చేరారు. రుహోల్లాకు అయతొల్లా అలీ ఖమేనీ శిష్యుడయ్యారు. ఈరోజు తాను చేసే, నమ్మే ప్రతీది కూడా ఇస్లాంకు చెందిన ఖమేనీ దార్శనికత నుంచే వచ్చిందని అయతొల్లా అలీ ఖమేనీ చెబుతుంటారు. షాకు వ్యతిరేకంగా ఆయన చురుకుగా పోరాటం చేశారు. పలుసార్లు జైలు పాలయ్యారు.

Read Also: Pahalgam: మళ్లీ పర్యాటకులను ఆహ్వానిస్తున్న పహల్గామ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్ అణు చర్చలపై “సంతోషంగా లేను”: ట్రంప్

ఇరాన్ అణు చర్చలపై “సంతోషంగా లేను”: ట్రంప్

‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ హోదాపై కీలక ఒప్పందం

‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ హోదాపై కీలక ఒప్పందం

ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆందోళన

ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆందోళన

మృతుల సంఖ్యపై పాకిస్థాన్‌ చెబుతున్న లెక్కలు నిజమేనా!

మృతుల సంఖ్యపై పాకిస్థాన్‌ చెబుతున్న లెక్కలు నిజమేనా!

పాక్-అఫ్గన్ యుద్ధంలో జోక్యం చేసుకోనన్న ట్రంప్

పాక్-అఫ్గన్ యుద్ధంలో జోక్యం చేసుకోనన్న ట్రంప్

ఆంథ్రోపిక్ కు ట్రంప్ ‘నో యూజ్’ షాక్

ఆంథ్రోపిక్ కు ట్రంప్ ‘నో యూజ్’ షాక్

తరచుగా విమాన ప్రమాదాలు..మొన్న కొలంబియా నేడు బొలీవియా

తరచుగా విమాన ప్రమాదాలు..మొన్న కొలంబియా నేడు బొలీవియా

రియాద్‌లో రాజమండ్రి దంపతుల హత్య

రియాద్‌లో రాజమండ్రి దంపతుల హత్య

కరెన్సీ నోట్లు మోసిన విమానం కూలింది, 15 మంది మృతి

కరెన్సీ నోట్లు మోసిన విమానం కూలింది, 15 మంది మృతి

అప్పుడే పుట్టిన ఈ శిశువు బరువు ఎంతో తెలుసా..?

అప్పుడే పుట్టిన ఈ శిశువు బరువు ఎంతో తెలుసా..?

కాలిఫోర్నియాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెంది డజన్ల కొద్దీ ఎలిఫెంట్ సీల్స్ పిల్లలు మృతి

కాలిఫోర్నియాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెంది డజన్ల కొద్దీ ఎలిఫెంట్ సీల్స్ పిల్లలు మృతి

ప్రపంచంలోనే ఎత్తైన వంతెన నుంచి జాలువారుతున్నకృత్రిమ జ‌ల‌పాతం

ప్రపంచంలోనే ఎత్తైన వంతెన నుంచి జాలువారుతున్నకృత్రిమ జ‌ల‌పాతం

📢 For Advertisement Booking: 98481 12870