📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

India: ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ పై భారత్ ఆగ్రహం

Author Icon By Vanipushpa
Updated: April 29, 2025 • 11:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్‌పై భారత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఉగ్రవాదులకు తమ దేశం మద్దతు ఇవ్వడమే కాకుండా, వారికి శిక్షణ కూడా ఇస్తోందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్వయంగా అంగీకరించిన విషయాన్ని భారత్ ప్రముఖంగా ప్రస్తావించింది. పాకిస్థాన్ ఈ అంతర్జాతీయ వేదికను దుర్వినియోగం చేస్తూ, భారత్‌పై నిరాధార ప్రచారానికి పాల్పడుతోందని మండిపడింది.
భారత్‌పై నిరాధార ఆరోపణలు
భారత డిప్యూటీ పర్మినెంట్ రెప్రజెంటేటివ్ యోజన పటేల్ మాట్లాడుతూ, పాకిస్థాన్ తీరును తీవ్రంగా ఖండించారు. “ఒక నిర్దిష్ట ప్రతినిధి బృందం ఈ వేదికను దుర్వినియోగం చేయడం, దాని ప్రాముఖ్యతను తగ్గించడం దురదృష్టకరం. భారత్‌పై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రచారంలో మునిగి తేలుతున్నారు. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇటీవల ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో పాక్ ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం, శిక్షణ, నిధులు సమకూర్చడం వంటి చరిత్రను అంగీకరించిన విషయాన్ని ప్రపంచమంతా విన్నది” అని యోజన పటేల్ గుర్తు చేశారు.

పాకిస్థాన్‌ బాధ్యతారహితంగా ప్రవర్తిసున్నది
“ఈ బహిరంగ ఒప్పుకోలు ఎవరినీ ఆశ్చర్యపరచదు. ఇది ప్రపంచ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, ప్రాంతాన్ని అస్థిరపరుస్తున్న పాకిస్థాన్‌ను ఒక బాధ్యతారహిత రాజ్యంగా బయటపెడుతోంది. ప్రపంచం ఇకనైనా దీన్ని చూసీచూడనట్లు వదిలేయకూడదు” అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా నాయకులు, ప్రభుత్వాలు అందించిన బలమైన, నిస్సందేహమైన మద్దతుకు, సంఘీభావానికి భారత్ కృతజ్ఞతలు తెలుపుతోందని ఆమె చెప్పారు. ఉగ్రవాదం పట్ల అంతర్జాతీయ సమాజం జీరో టాలరెన్స్‌తో ఉందని చెప్పడానికి ఈ మద్దతే నిదర్శనమని అన్నారు. 2008 నాటి ముంబై దాడుల తర్వాత పౌరులు అత్యధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోయింది పహల్గామ్ దాడిలోనేనని ఆమె గుర్తు చేశారు.

“ఐరాస భద్రతా మండలి తన ప్రకటనలో చెప్పినట్లుగా, ఇలాంటి నీచమైన ఉగ్రవాద చర్యలకు పాల్పడిన వారిని, వాటిని నిర్వహించిన వారిని, నిధులు సమకూర్చిన వారిని, స్పాన్సర్ చేసిన వారిని కచ్చితంగా బాధ్యులను చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టాలి” అని యోజన పటేల్ స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితిలో భారత డిప్యూటీ పర్మినెంట్ రెప్రజెంటేటివ్
“ఈ వేదికను ఉపయోగించి భారత్‌పై నిరాధార ఆరోపణలు చేయడం దురదృష్టకరం” అని మండిపాటు
ఉగ్రవాదంపై ఉన్న ఆధారాలను ప్రపంచం ముందుకు తెచ్చిన భారత్.

Read Also: Pahalgam Attack: పరోక్ష యుద్ధంతో వణికిపోతున్న పాకిస్తాన్‌..అగ్రదేశాలన్నీ భారత్‌కు మద్దతు

#telugu News Ap News in Telugu at Pakistan at the United Nations Breaking News in Telugu Google News in Telugu India's anger Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.