India: ఇండియా కంటే విదేశాల్లో సెటిల్ అవడం ఇష్టం

Read Time:  1 min
ఇండియా కంటే విదేశాల్లో సెటిల్ అవడం ఇష్టం
ఇండియా కంటే విదేశాల్లో సెటిల్ అవడం ఇష్టం
FONT SIZE
GET APP

కొందరు పై చదువుల కోసం విదేశాలకు వెళ్తుంటారు, మరికొందరు జాబ్ ద్వారా అక్కడ సెటిల్ అయ్యేందుకు వెళ్తుంటారు. ఇలా కొన్ని కారణాల వల్ల ఇండియా నుండి ఇతర దేశాలకు వెళ్లే వాళ్ళు ప్రతి ఏడాది చాలా మంది ఉన్నారు. కానీ దీనికి సంబందించి సంపనులు లేదా అత్యంత ధనవంతులు మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఏంటంటే భారతదేశంలో రూ. 25 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులు ఉన్న వారిని మనం అత్యంత ధనవంతులు లేదా సంపన్నులు, కోటీశ్వరులు అని పిలుస్తాము. అయితే ఈ విషయంలో అత్యంత సంపద ఉన్న ప్రతి ఐదుగురు కోరీశ్వరుల్లో ఒకరు ఇండియా విడిచి వెళ్లాలనుకుంటున్నట్లు చెప్పారు.

ఇండియా కంటే విదేశాల్లో సెటిల్ అవడం ఇష్టం

అత్యంత సంపన్న వ్యక్తులపై సర్వే
ఇటీవల, కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రైవేట్ బ్యాంకింగ్ విభాగం తరపున భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యక్తులపై ఒక సర్వే నిర్వహించింది. దేశంలోని 12 నగరాల్లో నివసిస్తున్న 150 మంది అధిక నికర విలువ ఉన్న వ్యక్తులపై కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రైవేట్ బ్యాంకింగ్ విభాగం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది.
వీరిలో ప్రతి ఐదుగురిలో ఒకరు భారతదేశం విడిచి వెళ్లాలనుకుంటున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయానికి గల కారణాలలో విదేశాలలో లభించే పన్ను రాయితీలు, పిల్లల భవిష్యత్తు అలాగే పర్యావరణ కాలుష్యం టాప్’లో ఉన్నాయి.

విదేశాలలో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిపై మొగ్గు
కరోనావైరస్ మహమ్మారి తర్వాతే చాలా మంది సంపన్నులు వారి పెట్టుబడులను పెంచుకోవడం వైపుతో మనస్తత్వాన్ని కూడా మార్చుకున్నారు. ఈ కారణంగా వీరు విదేశీ రియల్ ఎస్టేట్, ఈక్విటీ మార్కెట్లను పరిశీలిస్తున్నారని కూడా పేర్కొంది. అధిక నికర విలువ ఉన్న వ్యక్తుల ఖర్చు అలవాట్లను చూస్తే, వీరు ఎక్కువగా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది.

ALSO READ: Tiktok : టిక్ టాక్‌కు డొనాల్డ్ ట్రంప్ కొత్త లైఫ్

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.