India: భారత్ తో సైప్రస్ కొత్త స్నేహం.. టర్కీకి ఇక వణుకు..

Read Time:  1 min
భారత్ తో సైప్రస్ కొత్త స్నేహం.. టర్కీకి ఇక వణుకు..
భారత్ తో సైప్రస్ కొత్త స్నేహం.. టర్కీకి ఇక వణుకు..
FONT SIZE
GET APP

భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) సైప్రస్(Cyprus) అనే ఓ చిన్న దేశంలో పర్యటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను మోదీ ఎక్స్(Modi X) ద్వారా ప్రజలతో పంచుకున్నారు. మధ్యదరా సముద్రంలో చిన్న ద్వీప దేశమైన సైప్రస్ గురించి మనలో చాలా మందికి తెలియదు. ఆ మాటకొస్తే మన దేశాధినేతలు కూడా సైప్రస్‌కు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ ప్రపంచ శక్తిగా ఎదిగే క్రమంలో భారత్.. తనతో కలిసి వచ్చే ప్రతి దేశాన్నీ కలుపుకొని పోతోంది. అయితే సైప్రస్‌తో దోస్తీ మాత్రం అంతకు మించిన కొత్త సమీకరణలకు తెరతీయనుంది.
ఎందుకంటే తుర్కియే గుర్తుంది కదా, అదేనండీ టర్కీ. గతంలో టర్కీని భారీ భూకంపం వణికించినప్పుడు ‘ఆపరేషన్ దోస్త్’తో భారత్ అండగా నిలిచింది. కానీ ఆపరేషన్ సింధూర్ సమయంలో టర్కీ పాకిస్థాన్‌కు మద్దతు ప్రకటించడంతోపాటు.. మనపై దాడులకు డ్రోన్లను సైతం ఇస్లామాబాద్‌కు అందించింది. ఇప్పుడు టర్కీకి ఓ బలమైన సందేశం ఇవ్వడం కోసం ప్రధాని మోదీ సైప్రస్‌లో పర్యటిస్తున్నారు.

India: భారత్ తో సైప్రస్ కొత్త స్నేహం.. టర్కీకి ఇక వణుకు..
India: భారత్ తో సైప్రస్ కొత్త స్నేహం.. టర్కీకి ఇక వణుకు..

భారత్ తనకు అండగా సైప్రస్‌
టర్కీ, సైప్రస్ రెండింటి మధ్య వైరం ఉంది. 1974లో సైప్రస్ మీద దాడి చేసిన టర్కీ.. ఆ దేశంలో మూడో వంతు భూభాగాన్ని ఆక్రమించుకుంది. అదిగో అప్పటి నుంచి టర్కీ అంటే సైప్రస్‌కు ఏమాత్రం గిట్టదు. అలాంటి సైప్రస్‌కు ప్రధాని మోదీ వెళ్లడం, అది కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత చేపట్టిన తొలి విదేశీ పర్యటన ఇదే కావడం అంటే.. నా శత్రువుతో నువ్వు చెలిమి చేస్తే.. నీ శత్రువుతో నేను దోస్తీ చేస్తానని టర్కీకి బలంగా సంకేతాలు ఇచ్చినట్టే కదా. టర్కీ గనుక తన జోలికొస్తే.. భారత్ తనకు అండగా ఉంటుందనే భరోసా సైప్రస్‌కు దక్కినట్టే.
ఎందుకంటే తుర్కియే గుర్తుంది కదా, అదేనండీ టర్కీ . గతంలో టర్కీని భారీ భూకంపం వణికించినప్పుడు ‘ఆపరేషన్ దోస్త్’తో భారత్ అండగా నిలిచింది. కానీ ఆపరేషన్ సింధూర్ సమయంలో టర్కీ పాకిస్థాన్‌కు మద్దతు ప్రకటించడంతోపాటు.. మనపై దాడులకు డ్రోన్లను సైతం ఇస్లామాబాద్‌కు అందించింది. ఇప్పుడు టర్కీకి ఓ బలమైన సందేశం ఇవ్వడం కోసం ప్రధాని మోదీ సైప్రస్‌లో పర్యటిస్తున్నారు.

సైప్రస్ పర్యటనకు వెళ్తే.. టర్కీకి మెసేజ్ ఎలా ఇస్తారని అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నాం..టర్కీ, సైప్రస్ రెండింటి మధ్య వైరం ఉంది. 1974లో సైప్రస్ మీద దాడి చేసిన టర్కీ.. ఆ దేశంలో మూడో వంతు భూభాగాన్ని ఆక్రమించుకుంది. అదిగో అప్పటి నుంచి టర్కీ అంటే సైప్రస్‌కు ఏమాత్రం గిట్టదు. అలాంటి సైప్రస్‌కు ప్రధాని మోదీ వెళ్లడం, అది కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత చేపట్టిన తొలి విదేశీ పర్యటన ఇదే కావడం అంటే.. నా శత్రువుతో నువ్వు చెలిమి చేస్తే.. నీ శత్రువుతో నేను దోస్తీ చేస్తానని టర్కీకి బలంగా సంకేతాలు ఇచ్చినట్టే కదా. టర్కీ గనుక తన జోలికొస్తే.. భారత్ తనకు అండగా ఉంటుందనే భరోసా సైప్రస్‌కు దక్కినట్టే.
ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక శక్తిగా, అత్యంత శక్తివంతమైన సైనిక శక్తుల్లో ఒకటిగా ఎదుగుతోన్న భారత్‌తో స్నేహం అనేది సైప్రస్‌కు కొండంత అండ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
సైప్రస్‌కు మన మద్దతు దొరుకుతుంది. టర్కీ మీద కోపంతో ఆ దేశానికి మద్దతు ఇవ్వడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి అనుకుంటున్నారా? వ్యూహాత్మకంగా, దౌత్యపరంగా, భౌగోళిక రాజకీయ పరంగానే కాకుండా ఆర్థికంగానూ సైప్రస్‌తో దోస్తీ భారత్‌కు ప్రయోజనకరం కానుంది.

Read Also: Yoga Day 2025: భారత్ లో యోగా సాధనకు ప్రసిద్ధమైన ప్రదేశాలు

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.