हिन्दी | Epaper
H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

Sheikh Hasina: షేక్ హసీనాను విమర్శిస్తే రహస్య జైలులో భయానక శిక్ష

Vanipushpa
Sheikh Hasina: షేక్ హసీనాను విమర్శిస్తే రహస్య జైలులో భయానక శిక్ష

అధికారులు ఆ గోడను బద్దలు చేసినప్పుడు, దాని వెనుక వారికో రహస్య కారాగారం కనిపించింది. బయటి ప్రపంచానికి కనిపించకుండా, ఈ జైలు ద్వారాన్ని హడావుడిగా ఇటుకరాళ్లతో గోడలా కట్టేశారు. మీర్ అహ్మద్ బిన్ ఖాసీంతోపాటు మరికొందరు ఈ జైలు గురించి గుర్తు చేయకపోయినట్లయితే ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ రహస్య జైలును విచారణాధికారుల బృందం బహుశా ఎన్నడూ చూసి ఉండేది కాదేమో. పదవీచ్యుతురాలైన షేక్ హసీనాను విమర్శించిన ఖాసీం 8 ఏళ్లు ఈ జైలులో గడిపారు. జైలులో ఆయన ఎక్కువ కాలం కళ్లకు గంతలతోనే ఉన్నారు. దీంతో ఆయన తన పరిసరాల నుంచి వచ్చే శబ్దాలను గమనించేవారు. ప్రత్యేకించి విమానాలు దిగే శబ్దం ఆయనకు స్పష్టంగా గుర్తుండిపోయింది. ఇదే విచారణా బృందాన్ని విమానాశ్రయంలోని సైనిక స్థావరం వైపు నడిపించింది.

షేక్ హసీనాను విమర్శిస్తే రహస్య జైలులో భయానక శిక్ష

‘కాలు బయటపెట్టాలంటే భయం’
కిందటి ఆగస్టులో బంగ్లాదేశ్‌లో జరిగిన భారీ ఆందోళనల కారణంగా షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ఆ తరువాత ఈ జైలులోని బందీలను విడుదల చేశారు. విచారణాధికారులు ఖాసీంలాంటి వందలాదిమంది బాధితులతో మాట్లాడారు. ఇక్కడ అనేకమందిని అన్యాయంగా చంపేశారని బాధితులు కొందరు ఆరోపించారు. ఢాకా విమానాశ్రయం నుంచి రోడ్డుపై ఉన్న జైళ్లతో సహా రహస్య జైళ్లను నడుపుతున్న వ్యక్తులు ఎక్కువగా ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ (ఆర్ఏబీ) అనే ఉగ్రవాద నిరోధక విభాగానికి చెందినవారని దర్యాప్తు అధికారులు తెలిపారు.
హసీనా నుంచి వచ్చే ఆదేశాలను పాటిస్తారు
వీరు నేరుగా హసీనా నుంచి వచ్చే ఆదేశాలను పాటించేవారని విచారణాధికారులు చెప్పారు. ” చాలామంది గల్లంతుకావడం అనేది ప్రధాని అనుమతి లేదా ఆదేశాలతోనే జరిగాయని సంబంధిత అధికారులు చెప్పారు” అని బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ ఇస్లాం చెప్పారు.
అయితే తమకు తెలియకుండానే ఈ నేరాలు జరిగాయని, దీనికి ఎలాంటి బాధ్యత లేదని, సైనిక వ్యవస్థ సొంతంగా పనిచేస్తోందని హసీనా పార్టీ చెబుతోంది . కానీ, ఈ ఆరోపణను సైన్యం తోసిపుచ్చింది. ఏడు నెలల తరువాత, ఖాసీం ఇతరులు విడుదలయ్యారు. కానీ తమను బంధించినవారు ఇప్పటికీ సైన్యంలో కొనసాగుతుండటంతో వారు భయపడుతున్నారు.

కానీ తనను బంధించిన చిన్నగదిని వివరంగా చూపేందుకు ఆయన మొదటిసారి మీడియాను తీసుకువెళ్లారు. ఆ గది ఎంత చిన్నదో టార్చ్‌లైట్ వెలుగులో తెలుస్తోంది. ఓ మనిషి కనీసం నిటారుగా నిలబడటానికి వీలులేదు. గదంతా కంపు కొడుతోంది. కొన్ని గోడలు పడిపోయాయి.
వేసవిలో భరించలేనంత వేడి
ఖాసీం తాను గడిపిన సెల్‌లో సన్నని నీలిరంగు టైల్స్ చాలా స్పష్టంగా గుర్తున్నాయి. అందుకే విచరాణాధికారులు నేరుగా అక్కడకు వెళ్లగలిగారు. ఇప్పడా నీలిరంగు టైల్స్ ముక్కలైపోయి ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ లోని గదులతో పోలిస్తే, ఇది చాలా పెద్దది, 10 x 14 అడుగులు (3 మీ x 4.3 మీ). ఒక వైపు మరుగుదొడ్డి ఉంది. బందీగా ఉన్నప్పుడు తాను అక్కడ ఎలా గడిపిందీ ఖాసీం గదిలో తిరుగుతూ వివరించారు.
ఎప్పటికీ బయటపడలేననుకున్నా
చాలా సందర్భాలలో తమను కొట్టి చిత్రహింసలకు గురిచేశారన్నారు. ఏదో ఒకరోజు తాము రోడ్డుమీద నడుస్తున్నప్పుడో, బస్సులో ప్రయాణిస్తున్నప్పుడో, తమను బంధించినవారు కనపడతారనే భయం దాదాపు ప్రతివారిలోనూ కనిపించింది. ”నేను కారు ఎక్కినప్పుడల్లా, ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఎక్కడున్నానో తలుచుకుంటే భయం వేస్తుంటుంది.” అని 35 ఏళ్లు అతికుర్ రెహ్మాన్ రస్సెల్ చెప్పారు.
Read Also: Trade War: చైనా అమెరికాల మధ్య ట్రేడ్ వార్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని చెప్పలేదు: రష్యా

భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని చెప్పలేదు: రష్యా

మహాత్మాగాంధీ విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు

మహాత్మాగాంధీ విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు

మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు

మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు

వెనిజులా నుండి భారత్ చమురు కొంటుందా?

వెనిజులా నుండి భారత్ చమురు కొంటుందా?

మయన్మార్ నిందితులకు చైనా మరణ శిక్ష అమలు

మయన్మార్ నిందితులకు చైనా మరణ శిక్ష అమలు

ట్రంప్ ప్రకటన.. మోదీ మౌనం!..అసలు నిజం ఏది?

ట్రంప్ ప్రకటన.. మోదీ మౌనం!..అసలు నిజం ఏది?

జేఎఫ్-17 థండర్ యుద్ధ విమానాలు..పాక్ కు కొత్త చిక్కులు!

జేఎఫ్-17 థండర్ యుద్ధ విమానాలు..పాక్ కు కొత్త చిక్కులు!

అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా

అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా

ట్రంప్-మోదీ డీల్!..ప్రధాని ప్లాన్ ఫలించేనా?

ట్రంప్-మోదీ డీల్!..ప్రధాని ప్లాన్ ఫలించేనా?

సింధూ జలాల ఒప్పందంపై COA విచారణ..మండిపడ్డ భారత్‌

సింధూ జలాల ఒప్పందంపై COA విచారణ..మండిపడ్డ భారత్‌

ప్రయాణికులకు గుడ్ న్యూస్ .. 40 గ్రాముల బంగారం తెచ్చుకోవచ్చు

ప్రయాణికులకు గుడ్ న్యూస్ .. 40 గ్రాముల బంగారం తెచ్చుకోవచ్చు

ట్రంప్ డీల్ బూస్ట్, చైనాపై భారత్‌కు భారీ వాణిజ్య ఆధిక్యం!

ట్రంప్ డీల్ బూస్ట్, చైనాపై భారత్‌కు భారీ వాణిజ్య ఆధిక్యం!

📢 For Advertisement Booking: 98481 12870