हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Chinmay Deore: ట్రంప్ ప్రభుత్వం పైన చిన్మయ్ డియోర్ కోర్టులో దావా

Vanipushpa
Chinmay Deore: ట్రంప్ ప్రభుత్వం పైన చిన్మయ్ డియోర్ కోర్టులో దావా

డోనాల్డ్ ట్రంప్ విద్యార్థులను ఇబ్బంది పెడుతూ తీసుకుంటున్న నిర్ణయాల పైన విద్యార్థి లోకం తీవ్ర ఆందోళనలో ఉంది. ట్రంప్ ఇమిగ్రేషన్ విధానంలో అమెరికాలో వివిధ దేశాలకు చెందిన విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంలో పడింది. క్యాంపస్ ఆక్టివిజం పేరుతో విద్యార్థుల వీసాలను రద్దు చేస్తున్న ట్రంప్ వారిని దేశం విడిచి వెళ్లాలని బహిష్కరణ ఆదేశాలను జారీ చేస్తున్నారు. హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఇమిగ్రేషన్ అధికారుల పైన కోర్టులో దావా ఇక తాజాగా ఓ భారత విద్యార్థితో పాటు పలువురిపైన వీసా రద్దు చేసి, బహిష్కరణ వేటు వేసిన ట్రంప్ పై, ట్రంప్ ప్రభుత్వం పైన చిన్మయ్ డియోర్, చైనాకు చెందిన మరో ఇద్దరు, నేపాల్ కు చెందిన మరొకరు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఇమిగ్రేషన్ అధికారుల పైన కోర్టులో దావా వేశారు.

ట్రంప్ ప్రభుత్వం పైన చిన్మయ్ డియోర్ కోర్టులో దావా

నోటీసులు ఇవ్వకుండా స్టూడెంట్స్ వీసా రద్దు
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా స్టూడెంట్స్ వీసా రద్దు స్టూడెంట్స్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో వారి స్టూడెంట్ ఇమిగ్రేషన్ స్టేటస్ ను ఎటువంటి నోటీసులు లేకుండా చట్ట విరుద్ధంగా రద్దు చేయడం పైన వీరు కోర్టుకెక్కారు. ఎటువంటి నోటీసులు లేకుండా తమ వీసా రద్దు చేయడాన్ని వారు కోర్టులో సవాల్ చేశారు. వీసా రద్దుతో కోర్టును ఆశ్రయించిన భారతీయ విద్యార్థి చిన్మయ్ డియోర్ వేన్ స్టేట్ యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్ అండర్ గ్రాడ్యుయేట్ అయిన 21 ఏళ్ల భారతీయ విద్యార్థి చిన్మయ్ డియోర్ తన F-1 విద్యార్థి హోదాను , US ఇమ్మిగ్రేషన్ అధికారులు అకస్మాత్తుగా రద్దు చేసిన తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు. మిచిగాన్ డిస్ట్రిక్ట్ కోర్టులో విద్యార్థుల తరఫున వ్యాజ్యాన్ని అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ దాఖలు చేసింది.
తమ హోదా తమకు తిరిగి ఇప్పించాలని వినతి
తమ హోదా తమకు తిరిగి ఇప్పించాలని కోర్టుకు వినతి తమపై ఎటువంటి నేరాల ఆరోపణలు లేకపోయినప్పటికీ, తాము ఎటువంటి ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని ఉల్లంఘించనప్పటికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ వీసాను రద్దు చేశారని వారు తమ పిటిషన్లో పేర్కొన్నారు. చట్టపరమైన తమ హోదాను తిరిగి ఇప్పించాలని వారు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇంతకు ముందే ఇదే తరహాలో క్రిష్ లాల్ కేసు ఇప్పటికే ఇదే తరహాలో ట్రంప్ పైన 21 ఏళ్ల భారతీయ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి క్రిష్ లాల్ కోర్టులో కేసు వేశారు. క్రిష్ లాల్ ను బహిష్కరించ కుండా అమెరికా కోర్టు తాత్కాలికంగా ట్రంప్ కు వ్యతిరేకంగా తీర్పును కూడా ఇచ్చింది. ఇక మే నెలలో క్రిష్ లాల్ యూనివర్సిటీ నుండి తన గ్రాడ్యుయేట్ పట్టాను పొందనున్నారు.

ట్రంప్ చర్యలతో భారతీయ విద్యార్థులు సతమతం ఇక ప్రస్తుతం ఈ కేసులో కూడా కోర్టు ఏం చెబుతుంది? విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇస్తుందా? లేక ట్రంప్ ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థిస్తుందా అనేది వేచి చూడాలి. మొత్తంగా ట్రంప్ చర్యలతో భారత విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నది మాత్రం వాస్తవం.

Read Also: China : 4 నెలల్లో 85,000 వీసాలు జారీ చేసింది, వాణిజ్య యుద్ధం వేళ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870