📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

China: అమెరికాతో ఒప్పందాలు చేసుకునే దేశాలకు చైనా వార్నింగ్

Author Icon By Vanipushpa
Updated: April 21, 2025 • 11:12 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదురుతోంది. రెండు దేశాలు పోటాపోటీగా ఒకదానిపై మరొకటి టారిఫ్ లు విధించుకున్నాయి. ఈ నేపథ్యంలో తమ ప్రయోజనాలకు నష్టం కలిగించే విధంగా అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవద్దని చైనా ఇతర దేశాలను తీవ్రంగా హెచ్చరించింది. తమ హెచ్చరికలను పెడచెవిన పెట్టి ఒప్పందాలు కుదుర్చుకోవాలని చూస్తే ప్రతీకార చర్యలు తీసుకుంటామని చైనా స్పష్టం చేసింది.
చైనా ప్రయోజనాలకు నష్టం కలిగిస్తే సహించం
అమెరికాతో సుంకాలను తగ్గించుకోవడం లేదా మినహాయింపుల కోసం చర్చలు జరుపుతున్న దేశాలు, చైనాతో వాణిజ్యాన్ని తగ్గించుకునేలా అమెరికా (ట్రంప్ ప్రభుత్వం) ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన విడుదల చేసింది. “చైనా ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఏ దేశం ఒప్పందం చేసుకున్నా దానిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. అలాంటి పరిస్థితి తలెత్తితే, దానిని ఎప్పటికీ అంగీకరించబోమని, కచ్చితంగా ప్రతీకార చర్యలు తీసుకుంటామని” చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు.

అమెరికా విరుచుకొంటున్న చైనా
“స్వప్రయోజనాల కోసం ఇతరుల ప్రయోజనాలను దెబ్బతీయడం పులి చర్మాన్ని కోరుకోవడమే. అది చివరికి విఫలమవుతుంది, ఇతరులకు హాని చేస్తుంది” అని చైనా తన ప్రకటనలో పేర్కొంది. అమెరికా ఏకపక్షంగా, రక్షణాత్మక విధానాలతో వ్యవహరిస్తోందని, సుంకాలను దుర్వినియోగం చేస్తోందని చైనా ఆరోపించింది. తమ హక్కులు, ప్రయోజనాలను కాపాడుకునే సామర్థ్యం తమకుందని, అమెరికా చర్యలకు వ్యతిరేకంగా అన్ని దేశాలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చైనా తెలిపింది.
ట్రంప్, చైనాతో వాణిజ్య చర్చలు
ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనాతో వాణిజ్య చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఒక మంచి ఒప్పందం కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ఈ చర్చల విషయాన్ని చైనా ధృవీకరించలేదు. తాము వాణిజ్య యుద్ధాన్ని చివరి వరకు కొనసాగిస్తామని చెబుతూనే, చర్చలకు సిద్ధమని సంకేతాలిచ్చింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ వాణిజ్య వివాదం ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారితీయవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Read Also: J.D. Vance : రేపు భారత పర్యటనకు వస్తున్న అమెరికా జేడీ వాన్స్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu China warns countries Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today that make deals with the US

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.