ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయి. ఓవైపు భారత్- పాకిస్థాన్(Bharatha, Pakistan) యుద్ధం, అమెరికా- చైనా టారిఫ్ (America-China Tarrif) ల మోత, రష్యా- ఉక్రెయిన్ (Russia Ukraine war) యుద్ధం, ఇజ్రాయెల్- హమాస్ (Isreal, Hamas)ల మధ్య భీకర దాడులు, ఆఫ్రికన్ కంట్రీస్ లో సంక్షోభాలు.. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఏదో అలజడి నెలకున్న క్రమంలో ఇప్పుడు అందరి ముందు ఓ ప్రశ్న ఉంది. ప్రపంచంలోనే మోస్ట్ పవర్ ఫుల్ నేత ఎవరు..? ఈ ప్రశ్నను ప్రముఖ ఏఐ టూల్ చాట్ జీపీటీని అడగ్గా.. ఏం చెప్పిందంటే..? భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది.
ప్రపంచ దేశాలను తలదన్ని ఆయన టాప్ ప్లేస్ లోకి వచ్చారు. ట్రంప్, పుతిన్, జిన్ పింగ్ లు వెనుకబడ్డారు. ప్రపంచంలోనే పవర్ ఫుల్ నేత ఎవరు అని చాట్ జీపీటీని అడగ్గా భారత ప్రధాని నరేంద్ర మోదీ అని చెప్పింది. దీంతో దేశంలోని బీజేపీ, ఎన్డీఏ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆపరేషన్ సింధూర్ తో ..
ప్రపంచంలోనే శక్తివంతమైన ప్రధాని ఎవరు అన్న ప్రశ్నకు చాట్ జీపీటీ టక్కున ప్రధాని మోదీ అని పేర్కొంది. ప్రస్తుతం ఇండియాలో ఉన్న పరిస్థితులు.. ఆపరేషన్ సింధూర్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదాన్ని ఏరివేసిన నేతగా ప్రధాని నరేంద్ర మోదీకి ప్రశంసలు దక్కాయి. అలాగే ట్రంప్ వైఖరిని ఆయన ఎప్పటికప్పుడు ఎండగడుతూ అభివృద్ధి చెందుతున్న దేశాలకు అండగా ఉంటున్నారు.
ఇక రెండో స్థానంలో జపాన్ మాజీ ప్రధాని ఫుమియో కిషిదా ఉండటం గమనార్హం. ప్రస్తుతం జపాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మూడో స్థానంలో ఉంది.
Read Also: Donald Trump: ప్రపంచ దేశాల ముందు భారత్ ను తక్కువ చేసి మాట్లాడుతున్న ట్రంప్