Trump: నూతన నిబంధనలతో 12 దేశాలకు అమెరికాలో ‘నో ఎంట్రీ’

Read Time:  1 min
ఇజ్రాయెల్- ఇరాన్​ యుద్ధంతో G7 టూర్​ ముగించిన ట్రంప్​
ఇజ్రాయెల్- ఇరాన్​ యుద్ధంతో G7 టూర్​ ముగించిన ట్రంప్​
FONT SIZE
GET APP

అమెరికా(America)లోకి 12 దేశాల పౌరులు ప్రవేశించకుండా నిషేధం విధిస్తూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) జారీ చేసిన ఉత్తర్వులు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. విదేశీ ఉగ్రవాదుల నుంచి అమెరికాను రక్షించడానికే ఈ నిషేధం విధించినట్టు ఇంతకు ముందు ట్రంప్ తెలిపారు. ఈ దేశాలు వీసా భద్రతపై సహకరించడంలో విఫలమవడం, ప్రయాణికుల గుర్తింపులను ధృవీకరించలేకపోవడం, నేర చరిత్రల రికార్డులను తగినంతగా ఉంచకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.
ఈ దేశాల పౌరులకు ప్రవేశించే అవకాశం లేదు
అఫ్గానిస్థాన్, మయన్మార్‌, చాద్, రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, ఈక్వటోరియల్‌ గినియా, ఎరిత్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్‌ దేశాల పౌరులు అమెరికాలోని ప్రవేశించే అవకాశం లేదని అధికారులు తెలిపారు.

ట్రంప్ నూతన నిబంధనలతో 12 దేశాలకు అమెరికాలో 'నో ఎంట్రీ'
ట్రంప్ నూతన నిబంధనలతో 12 దేశాలకు అమెరికాలో ‘నో ఎంట్రీ’

ఈ దేశాలపై ఆంక్షల పెంపు!
మరోవైపు ఈ క్రింది 7 దేశాల పౌరులపై, వీసా దరఖాస్తులపై మరింత కఠినతర నిబంధనలు అమల్లోకి వచ్చాయి: బురుండీ, క్యూబా, లావోస్, సియెర్రా లియోన్, టోగో, తుర్క్‌మెనిస్థాన్, వెనెజువెలా నుంచి వచ్చే సందర్శకులపై ఆంక్షలను మరింత పెంచుతున్నట్లు ఇప్పటికే ట్రంప్‌ ప్రకటించారు. దీనితో ఈ ఏడు దేశాల పౌరుల ప్రవేశంపై పాక్షికంగా ప్రభావం పడనుంది.

విమర్శలు, ప్రతిస్పందనలు
ఈ నిషేధానికి వ్యతిరేకంగా, వివిధ దేశాలు మరియు సంస్థలు విమర్శలు వ్యక్తం చేశాయి. వివిధ మానవ హక్కుల సంస్థలు, ఈ చర్యలను వివక్షాత్మకంగా మరియు అన్యాయంగా భావిస్తున్నాయి. అలాగే, ఈ నిర్ణయం, అమెరికా-హైతి సంబంధాలను ప్రభావితం చేయవచ్చని భావిస్తున్నారు. ఈ దేశాల పౌరులు, వీసా దరఖాస్తుల సమయంలో మరింత సమాచారం అందించాల్సి ఉంటుంది, లేదా ప్రత్యేక ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉంటుంది.

Read Also: Errol Musk : ట్రంప్‌ ,ఎలాన్ మ‌స్క్‌ వివాదం పై ఎలాన్‌ తండ్రి ఎర్రోల్ మస్క్ స్పందన

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.