Donald Trump: పుతిన్ నుండి ట్రంప్‌కు ప్రత్యేక కానుక!

Read Time:  1 min
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య హంగరీలో జరగాల్సిన అత్యంత కీలక సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశంలో ప్రధానంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, దానిని నిలిపివేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరగాల్సి ఉంది. ఫోన్ సంభాషణ తర్వాత నిర్ణయం కొద్ది రోజుల క్రితం పుతిన్, ట్రంప్‌ల మధ్య సుమారు రెండు గంటల పాటు ఫోన్లో సంభాషణ జరిగింది. ఈ సంభాషణలో ఇద్దరు నాయకులు ఉక్రెయిన్ యుద్ధం గురించి, దానిని నిలిపివేసే మార్గాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా పుతిన్, ఉక్రెయిన్‌కు టామహాక్ క్షిపణులను ఇవ్వవద్దని ట్రంప్‌ను కోరినట్లు సమాచారం. ఈ చర్చల అనంతరం హంగరీ రాజధాని బుడాపెస్ట్‌లో సమావేశం కావాలని ఇద్దరూ అంగీకరించారు. తీవ్ర విభేదాలే ప్రధాన కారణం ట్రంప్ చెప్పిన కారణం ఇదే: అయితే ఈ సమావేశం వాయిదా పడినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవార ప్రకటించారు. వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్‌లో జరిగిన దీపావళి వేడుకల సందర్భంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. "ఒక నిష్ప్రయోజనమైన సమావేశాన్ని నేను కోరుకోలేదు, అందుకే పుతిన్‌తో జరగాల్సిన మీటింగ్‌ను వాయిదా వేశాను." అని ట్రంప్ తెలిపారు. xx పుతిన్-ట్రంప్‌ల మధ్య చర్చలు వాయిదా పడటానికి ఉక్రెయిన్ అంశంలో వారి మధ్య ఉన్న తీవ్ర విభేదాలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కాల్పుల విరమణ ప్రకటించడానికి పుతిన్ సిద్ధంగా లేరు. ఉక్రెయిన్ డొన్బాస్ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ట్రంప్ కూడా గతంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీతో భేటీ అయినప్పుడు డొన్బాస్‌ను వదులుకోవాలని ఒత్తిడి చేశారు. కానీ జెలెన్స్కీ దీనికి ససేమిరా అన్నారు. పుతిన్ కాల్పుల విరమణకు సిద్ధంగా లేకపోవడం, డొన్బాస్ అంశంలో ఇద్దరు నాయకులు ఏకాభిప్రాయానికి రాలేకపోవడం వల్లనే ఈ సమావేశం నిష్ప్రయోజనంగా మారుతుందని భావించి, ట్రంప్ వాయిదా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సమావేశం మళ్లీ ఎప్పుడు జరుగుతుందనే దానిపై రష్యా, అమెరికా అధికారులు ఎలాంటి కొత్త తేదీని ప్రకటించలేదు.

FONT SIZE
GET APP

ట్రంప్, పుతిన్ మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ మధ్య సంబంధాలు మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం తర్వాత, పుతిన్ ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారని క్రెమ్లిన్ వెల్లడించింది.

పుతిన్ నుండి ట్రంప్‌కు ప్రత్యేక కానుక!

ట్రంప్‌పై కాల్పుల ఘటన – పుతిన్ స్పందన
అమెరికాలోని పెన్సిల్వేనియాలో
జరిగిన ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. బుల్లెట్ గాయం తగిలిన ట్రంప్ ఆసుపత్రిలో చేరడంతో పుతిన్ తీవ్రంగా స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని పుతిన్ ప్రార్థనలు చేసినట్లు క్రెమ్లిన్ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుత ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ మధ్యవర్తిత్వం చేస్తున్నారు. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు ఆయన చర్చలు చేపట్టే యోచనలో ఉన్నారు. క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ప్రకారం, పుతిన్ ట్రంప్‌కు ఓ చిత్రపటాన్ని కానుకగా పంపారు. ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్ ఇటీవల మాస్కో పర్యటన సందర్భంగా ఈ కానుక అందుకున్నారు. విట్‌కాఫ్ కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, “అది అందమైన కానుక” అని పేర్కొన్నారు.
గతంలో పుతిన్ ఇచ్చిన మరో కానుక
2018లో ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన సందర్భంగా పుతిన్ ఓ సాకర్ బంతిని కానుకగా పంపించారు. అప్పట్లో ఈ బహుమతి అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ట్రంప్, పుతిన్ మధ్య కొనసాగుతున్న ఈ సత్సంబంధాలు, ప్రపంచ రాజకీయాలలో ఆసక్తికర పరిణామాలకు దారి తీసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.