Florida University: ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో కాల్పుల కలకలం

Read Time:  1 min
Florida University: ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో కాల్పుల కలకలం
FONT SIZE
GET APP

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో సాయుధుడైన ఓ దుండగుడు విద్యార్థులపైకి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్పులకు పాల్పడిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
దుండగుడి కాల్పుల్లో ఒకరు మృతి
దుండగుడి కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. ఐదుగురు గాయపడ్డారని స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కాల్పుల ఘటనతో పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని విద్యార్థులు, సిబ్బందికి పోలీసులు సూచించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు ఈ విషయాన్ని అధికారులు తీసుకెళ్లారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ట్రంప్..బాధితులకు సానుభూతి తెలియజేశారు. కాగా, కాల్పుల ఘటనతో యూనివర్సిటీలో జరగాల్సిన పలు స్పోర్ట్స్ ఈవెంట్స్ ను రద్దు చేశారు. గత కొంత కాలంగా అమెరికాలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటంతో ఆందోళన చెందే అంశంగా మారింది.

కాంగోలో పడవ ప్రమాదంలో 50 మంది మృతి
పడవ ప్రమాదంలో 50 మంది మృతి మధ్య ఆఫ్రికా దేశమైన కాంగోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మబండకా పట్టణం సమీపంలో నదిలో ఓ పడవ మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో దాదాపు 50 మంది మరణించారు. వందలాది మంది గల్లంతైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. మంగళవారం రాత్రి దాదాపు 400 మంది ప్రయాణికులతో కూడిన పడవ (చెక్క ఓడ) కాంగో నది (Congo River) మీదుగా మతాంకుము ఓడరేవు నుంచి బోలోంబా ప్రాంతానికి బయల్దేరింది. పడవ మబండకా పట్టణం సమీపంలోకి రాగానే మంటల్లో చిక్కుకుంది. దీంతో ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకునేందుకు నదిలోకి దూకేశారు. ఈతరాక నీటిలో మునిగి పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ 50 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

కాంగోలో పడవ ప్రమాదంలో 50 మంది మృతి

వందలాది మంది మృతి
మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. వందలాది మంది గల్లంతైనట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న రెడ్‌ క్రాస్‌, ప్రాంతీయ అధికారులు గల్లంతైన వారి కోసం నదిలో గాలింపు చేపట్టారు. దాదాపు 100 మందిని రక్షించి మబండకా టౌన్‌ హాల్‌లోని అధునాతన ఆశ్రయానికి తరలించారు. వారిలో చాలా మందికి కాలిన గాయాలైనట్లు అధికారులు తెలిపారు. కాగా, పడవలో ఎవరో వంట చేస్తున్న క్రమంలో మంటలు వ్యాపించినట్లు తెలిపారు.

Read Also: Elon Musk : పుతిన్ ప్రశంసలు, స్టార్లింక్‌కు ముప్పు

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.