Operation Sindoor: యుద్ధంలో 170 మంది ఉగ్రవాదులు హతం

Read Time:  1 min
Russia: యుద్ధంతో కుప్పకూలుతున్న రష్యా అర్థిక వ్యవస్థ
Russia: యుద్ధంతో కుప్పకూలుతున్న రష్యా అర్థిక వ్యవస్థ
FONT SIZE
GET APP

ఏప్రిల్​ 22న జమ్ముకశ్మీర్​(JammuKashmir)లోని పహల్గాం(Pahalgam)లో పర్యటకులపై జరిగిన ఉగ్రదాడికి, ప్రతీకారంగా భారత్​ చేపట్టిన ఆపరేషన్​ సిందూర్​(Operation Sindoor) విజయవంతమైంది. అయితే దీనికి సంబంధించి రక్షణ శాఖ ఉన్నత వర్గాలు లేటెస్ట్ వివరాలను వెల్లడించాయి. భారత్​ పాకిస్థాన్(Bharath Pakistan) పై మే7న జరిపిన దాడిలో 200 మందికి పైగా మరణించారని, పాక్​లోని కీలక ఉగ్రస్థావరాలు, బహవల్​పుర్​ ధ్వంసమైందని పేర్కొన్నాయి. ఈ దాడిలో 170 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. ఈ దాడిలో ఏడుగురు భారత సైనికులు ప్రాణాలు కోల్పోగా, 42 మంది పాక్​ సైనికులు మరణించారు. భారత్​ చేసిన వైమానిక దాడికి ప్రతిచర్యగా పాక్​ డ్రోన్లు, క్షిపణులతో దాడి చేయగా, ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడిన విషయం తెలిసిందే.

Operation Sindoor: యుద్ధంలో ఇప్పటివరకు 170 మంది ఉగ్రవాదులు హతం
Operation Sindoor: యుద్ధంలో 170 మంది ఉగ్రవాదులు హతం

ధ్వంసమైన జైషే మహ్మద్‌ ఉగ్రముఠా ప్రధాన కేంద్రం ధ్వంసమైన
ఈ ఆపరేషన్​లో భారత్​ గొప్ప విజయాన్ని సాధించిందని రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. పాక్​ వైమానిక స్థావరాలపై విరుచుకుపడి దయాది దేశ ఉగ్రస్థావరాలను మట్టికురిపించాయి. జైషే మహ్మద్‌ ఉగ్రముఠా ప్రధాన కేంద్రం ధ్వంసమైంది. ఈ దాడిలో భారత మహిళా పైలెట్లు కీలక పాత్ర పోషించారు. అయితే ఈ వైమానిక దాడిలో భారత బ్రహ్మోస్​ క్షిపణులు ప్రధాన పాత్ర పోషించాయని రక్షణ వర్గాలు తెలిపాయి.
సిందూర్​ విజయం పాక్​కు అవమానం
ఆపరేషన్​ సిందూర్​ ఇంకా ముగియలేదని తాత్కాలికంగా నిలిపివేశామని సదరు వర్గాలు తెలిపాయి. అయితే, ఆపరేషన్ సిందూర్​ విజయం పాక్​ను​ తీవ్రంగా భంగపాటుకు గురిచేసిందని, దీనికి ప్రతికారంగా భారత్​పై ఎప్పుడైనా దాడులు జరపవచ్చునని పేర్కొన్నాయి. అందుకని ముందస్తు చర్యగా భారత రక్షణ దళాలు హైఅలర్ట్​లో ఉన్నాయని వెల్లడించాయి. భారత్​, చైనా సరిహద్దు వివాదానికి సంబంధించి 2017లో డోక్లామ్​లో తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలే, సిందూర్ విజయానికి కారణం అని సదరు వర్గాలు తెలిపాయి. ​అయితే ఈ ఉగ్ర దాడిలో పాక్​ ఆర్మీ చీఫ్​ అసిమ్​ మునీర్​కు ఫీల్డ్​ మార్షల్​గా పదోన్నతి కల్పించాలని పాకిస్థాన్​ నిర్ణయించింది. ఇది తనకు జరిగిన అవమానాన్ని కప్పిబుచ్చుకునే పాక్​ చేసే ప్రయత్నంగా అభివర్ణించాయి.

Read Also: Walter Ladwig: భారత్–పాక్ సరికొత్త ఘర్షణ వాతావరణం: వాల్టర్ లాడ్విగ్ విశ్లేషణ

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.