Indrakeeladri Ammavari saree scam.. High Court issues key orders

ఇంద్రకిలాద్రి అమ్మవారి చీరల స్కామ్ : హైకోర్టు కీలక ఆదేశాలు

విజయవాడ: గత ప్రభుత్వ హయాంలో ఇంద్రకీలాద్రి లో 33,686 వేల చీరలు మాయం అయినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వం మారిన అధికారులు తీరు మారలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చీరల స్కామ్‌ పై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అమ్మవారికి భక్తులు ఇచ్చిన చీరల అమ్మకాల్లో అవకతవకలు జరిగినట్లు ఇప్పటికే నిర్ధారించారు. 2018-19 మధ్య జరిగిన అమ్మకాల్లో రూ.కోట్లలో అవినీతి జరిగిందని, రూ.1.68 కోట్ల మేర నగదు స్కాం జరిగినట్లు గుర్తించారు.

ఇంద్రకిలాద్రి అమ్మవారి చీరల స్కామ్

ఈవో భ్రమరాంబకు పోలీసులు షోకాజ్ నోటీసులు

అయితే చీరల అమ్మకాల బాధ్యతలు ఈవో, జూనియర్ అసిస్టెంట్ నిర్వహించారు. ఈ మేరకు గత జూనియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం, అప్పటి ఈవో భ్రమరాంబకు పోలీసులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీంతో షోకాజ్ నోటీసులపై సుబ్రహ్మణ్యం హైకోర్టును ఆశ్రయించారు. సుబ్రహ్మణ్యం పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. జిల్లా ఎండోమెంట్ అధికారితో ఎంక్వైరీ వేయాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు పూర్తి ఎంక్వైరీ జరిగే వరకూ పెనాల్టీ గానీ, చర్యలుగాని తీసుకోవద్దని తీర్పు వెల్లడించింది.

హైకోర్టు నుంచి కీలక ఆదేశాలు

కాగా చీరల స్కామ్ అభియోగంపై సుబ్రహ్మణ్యాన్ని గతంలో దేవాదాయ శాఖ పలుమార్లు విధుల నుంచి సస్పెన్షన్ వేటు వేసినా వైసీపీ నేతల తోడ్పాటుతో మళ్లీ విధుల్లో చేరారు. ఇక స్కామ్‌పై ప్రత్యేక కమిటీతో విచారణ కొనసాగుతోంది. ఈ రోజు ఇంద్రకిలాద్రిపై ఈ కమిటీ విచారణ జరపనున్న నేపథ్యంలో హైకోర్టు నుంచి కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో సుబ్రహ్మణ్యంకు స్వల్ప ఊరట లభించినట్లైంది.

Related Posts
Harish Rao : ఇందిరమ్మ ఎమర్జెన్సీలా రేవంత్ పాలన : హరీశ్ రావు
Revanth rule is like Indiramma Emergency.. Harish Rao

Harish Rao : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ వర్సిటీ విద్యార్థులు రోడ్డెక్కారు. ప్రశాంతంగా వారు నిరసన ర్యాలీలు తీస్తుంటే పోలీసులు Read more

నాగబాబు ను రాజ్యసభకు పంపే యోచన
నాగబాబు ను రాజ్యసభకు పంపే యోచన

మెగా బ్రదర్ నాగబాబుకు కీలకమైన కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరించినట్లు Read more

తెలంగాణలో ప్రారంభమైన ఇంటర్‌ పరీక్షలు
Inter exams begin in Telangana

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షలు మొదలయ్యాయి. పరీక్ష కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈరోజు నుంచి ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటల Read more

మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్
Center is good news for chilli farmers

కనీస ధర రూ. 11,781కి కొనుగోలు చేయాలని నిర్ణయం న్యూఢిల్లీ: ఏపీలో మర్చిధరలు పడిపోవడంతో రైతుల్ని ఆదుకోవడానికి కేంద్రాన్ని చంద్రబాబు రంగంలోకి దించారు. మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్ Read more