ఇండిగో వాలెంటైన్స్ డే ఆఫర్

ఇండిగో వాలెంటైన్స్ డే ఆఫర్

ప్రస్తుతం ఏం నడుస్తోంది అంటే ప్రేమికులకు గుడ్ టైమ్ నడుస్తోందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వాలంటైన్స్ వీక్ కొనసాగుతుండగా దానిని మరింత క్రేజీగా మార్చేందుకు విమానయాన సంస్థలు సైతం ఆఫర్ష వర్షం కురిపిస్తున్నాయి. ప్రేమికులకు మరపురాని ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఇండిగో సూపర్ ఆఫర్ ప్రకటించింది. తాజాగా దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో వాలెంటైన్స్ డే సందర్భంగా టిక్కెట్ బుక్కింగ్స్ పై 50 శాతం వరకు తగ్గింపును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కేవలం రెండు టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకేనని స్పష్టం చేసింది. ఆఫర్ కింద బుక్కింగ్స్ ఫిబ్రవరి 12 నుంచి 16 వరకు వరకు అందుబాటులో ఉంచబడ్డాయి. బుక్కింగ్ తేదీ నుంచి ప్రయాణానికి కనీసం రెండు వారాల గడువు ఉండాలని కంపెనీ వెల్లడించింది. అంటే దాదాపు ఒక్క టిక్కెట్ ధరతోనే ఇద్దరు ప్రయాణించటానికి వెసులుబాటు కల్పించబడిందని చెప్పుకోవచ్చు.

Advertisements
ఇండిగో వాలెంటైన్స్ డే ఆఫర్

ప్రేమికులకు స్పెషల్ గిఫ్ట్
ప్రస్తుతం వాలెంటైన్స్ వీక్ సందర్భంగా ప్రేమికుల కోసం అనేక ఆఫర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో వాలెంటైన్స్ డే స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా ప్రయాణికులు ఒక్క టిక్కెట్ ధరకే ఇద్దరు ప్రయాణించే అవకాశం పొందవచ్చు.

ఇండిగో వాలెంటైన్స్ డే ఆఫర్ వివరాలు
టిక్కెట్ ధరపై 50% తగ్గింపు
ఈ ఆఫర్ రెండు టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకే వర్తిస్తుంది
బుక్కింగ్స్ ఫిబ్రవరి 12 నుంచి 16 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి
బుక్కింగ్ చేసిన తేదీ నుంచి కనీసం రెండు వారాల గడువు తర్వాతే ప్రయాణించాల్సి ఉంటుంది
ఎక్కడ నుంచి టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు?
ప్రయాణికులు తమ టిక్కెట్లను ఇండిగో వెబ్‌సైట్, మొబైల్ యాప్, 6E స్కై లేదా అధికారిక బుక్కింగ్ పార్ట్నర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

అదనపు ప్రయోజనాలు – బ్యాగేజీ, సీట్లు, ఫుడ్ డిస్కౌంట్లు
15% తగ్గింపు – ప్రీపెయిడ్ బ్యాగేజీ ఛార్జీలపై
15% తగ్గింపు – స్టాండర్డ్ సీట్ల సెలక్షన్‌పై
10% తగ్గింపు – ఫుడ్ ప్రీ బుకింగ్‌పై
ఫ్లాష్ సేల్ – మెుదటి 500 టిక్కెట్ కొనుగోలుదారులకు అదనపు తగ్గింపు!
ఈ ప్రత్యేక ఫ్లాష్ సేల్‌లో భాగంగా, మెుదటి 500 మంది టిక్కెట్ బుక్ చేసుకునే ప్రయాణికులకు అదనంగా 10% తగ్గింపు లభిస్తుంది.

ఆఫర్ చివరి తేదీ – మిస్ చేసుకోవద్దు!
ఈ ప్రత్యేక ఆఫర్ ఫిబ్రవరి 16 రాత్రి 11:59 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే, బుక్కింగ్ అనంతరం ప్రయాణానికి కనీసం 15 రోజుల గడువు తప్పనిసరి అని ఇండిగో స్పష్టం చేసింది.

Related Posts
ఒక దేశం — ఒకే ఎన్నికల బిల్లు
onenationoneelection

న్యూఢిల్లీ : పార్లమెంట్‌లో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వం. బిల్లును ఆమోదించడానికి న్యాయ మంత్రి. బిల్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపుతారు. బిల్లు Read more

రతన్ టాటా చివరి పోస్ట్ ఇదే..
ratan tata last post

ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్ టాటా అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన చేసిన లాస్ట్ పోస్ట్ వైరలవుతోంది. 3 రోజుల క్రితం తన Read more

బీజేపీ ఎమ్మెల్యే దేవేందర్ రాణా మృతి
BJP MLA Devender Rana passed away

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాణా సోదరుడు, బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్ర సింగ్ రాణా (59) గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన అనారోగ్యంతో కొంతకాలం బాధపడుతూ Read more

బోరుబావిలో పడ్డ బాలుడు మృతి
Five year old Aryan

రాజస్థాన్ , డిసెంబర్ 12,బోరుబావిలో పడ్డ బాలుడిని కాపాడేందుకు రెండు రోజులుగా అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. విషాదకర సంఘటనగా మిగిలిపోయిన బాలుడి ఉదంతం రాజస్థాన్ Read more

×