కొత్త పాస్‌పోర్ట్ కోసం అప్లయ్ చేస్తున్నారా? అయితే ఈ విషయం గురించి తెలుసుకోండి. మార్చి నుండి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. పాస్‌పోర్ట్ పొందడానికి మీ దగ్గర ఈ డాకుమెంట్స్ ఉండాల్సిందే. ఈ కొత్త రూల్స్ ఏంటి ? పాస్‌పోర్ట్ కోసం అప్లయ్ చేసుకోవడానికి ఏ డాకుమెంట్స్ అవసరమో మరిన్ని వివరాలు మీకోసం… భారతదేశంలో విదేశాలకు వెళ్లడానికి పాస్‌పోర్ట్ ఒక ముఖ్యమైన డాకుమెంట్స్. ఇది లేకుండా, మీరు వీసా కోసం అప్లయ్ చేసుకోలేరు.
సెక్షన్ 24లోని నిబంధనల ప్రకారం..
విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఫిబ్రవరి 24వ తేదీన అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. 1967 పాస్‌పోర్ట్ చట్టంలోని సెక్షన్ 24లోని నిబంధనల ప్రకారం పాస్‌పోర్ట్ నియమాలను సవరించినట్లు సమాచారం. భారతదేశంలో పాస్‌పోర్ట్ పొందడానికి నియమాలను సవరించారు. 1 అక్టోబర్ 2023 తరువాత జన్మించిన వారికి పాస్‌పోర్ట్ అప్లయ్ చేసేటప్పుడు బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేసింది.

80వ స్థానంలో భారత పాస్‌పోర్ట్
భారతదేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది, అమెరికాతో సహా అనేక దేశాలలో భారతీయులు కీలక పదవులను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం, భారత పాస్‌పోర్ట్ ప్రపంచవ్యాప్తంగా 80వ స్థానంలో ఉంది. భారతదేశం ఇప్పుడు పాస్‌పోర్ట్ నిబంధనలకు కొన్ని సవరణలు చేసింది. దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.
బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి
బర్త్ సర్టిఫికెట్ ఎక్కడ పొందాలి? మునిసిపాలిటీ జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్ లేదా జనన మరణ నమోదు చట్టం, 1969 కింద పరిగణనలోకి తీసుకోబడుతుంది. అక్టోబర్ 1, 2023 తర్వాత జన్మించిన వారిలో చాలా మందికి బర్త్ సర్టిఫికెట్ఉంది. పాస్‌పోర్ట్ పొందడానికి, మీరు మున్సిపల్ జనన లేదా మరణ రిజిస్ట్రేషన్ అధికారుల నుండి ఒక లేఖను పొందవలసి ఉంటుంది.