కెనడా, మెక్సికోలపై సుంకాల విధింపు ప్రారంభించనున్నట్టు ఇటీవల అమెరికా ప్రకటించింది. అక్రమ వలసలను ఆపుతామని, చట్టవిరుద్ధంగా తయారు చేసిన ఫెంటానిల్ అమెరికాలోకి రావడాన్ని నిరోధిస్తామని ఆ దేశం చెబుతోంది. అమెరికాలోకి దిగుమతి అయ్యే వస్తువులపై ఫిబ్రవరి ప్రారంభంలోనే టారిఫ్‌లు విధించాల్సి ఉంది. కానీ, ఒక నెల వాయిదా పడింది. కెనడా, మెక్సికోల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 25 శాతం సుంకాలు విధించనున్నామని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పారు. కానీ, తుది రేటు కాస్త తక్కువగా ఉండొచ్చని అన్నారు.

అసలు టారిఫ్‌లు ఏంటి?
దిగుమతి అయ్యే వస్తువులపై విధించే పన్నులే సుంకాలు. టారిఫ్ అనేది ఒక వస్తువు ధరలో కొంత శాతంగా ఉంటుంది. విదేశాల నుంచి ఉత్పత్తులను దిగుమతి చేసుకునే సంస్థలు ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించి సరకు తీసుకొస్తాయి. ఒకవేళ ఒక సంస్థ దిగుమతి చేసే కార్ల ధర ఒక్కోటి 50 వేల డాలర్లు (రూ.43,59,091) ఉంటే.. దానిపై 25 శాతం టారిఫ్ అంటే, ఒక్కో దానిపై 12,500 డాలర్ల (రూ.10,89,744) ఛార్జీని చెల్లించాలి. దిగుమతి చేసుకునే సంస్థలు తాము చెల్లించిన టారిఫ్‌ల భారాన్ని పూర్తిగా కానీ, కొంతమేరకు కానీ వినియోగదారులపై వేస్తాయి. ఒకవేళ అమెరికా దిగుమతిదారులు రిటైల్ ధరలను పెంచడం ద్వారా ఈ టారిఫ్‌ల ఖర్చును వినియోగదారులకు బదలాయిస్తే, తీవ్ర ఆర్థిక భారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
ట్రంప్ టారిఫ్‌లకు ఎందుకు అనుకూలంగా ఉన్నారు?
టారిఫ్‌లు అమెరికా దేశీయ ఉద్యోగాలను కాపాడతాయని, కొత్త ఉద్యోగాలను సృష్టిస్తాయని డోనల్డ్ ట్రంప్ తరచూ చెబుతుంటారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ, పన్ను ఆదాయాలు పెరిగేందుకు ఇదొక మార్గంగా ఆయన చూస్తున్నారు. ‘‘విదేశాల కారణంతో ఉద్యోగాలు పోతాయని అమెరికా వర్కర్లు ఇక భయపడాల్సినవసరం లేదు. దీనికి బదులుగా, అమెరికా వల్ల తమ ఉద్యోగాలు పోగొట్టుకుంటామని విదేశాలు ఆందోళన చెందుతాయి’’ అని ట్రంప్ అన్నారు. స్టీల్‌పై టారిఫ్‌లు విధించడం అమెరికా జాతి భద్రతకు కూడా చాలా ముఖ్యమని ట్రంప్ చెప్పారు. ఎందుకంటే, దేశీయ స్టీల్‌తయారీదారులు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేలా ప్రోత్సహించనున్నారు. దిగుమతులపై ఆధారపడకుండా యుద్ధాల సమయంలో ఆయుధాలను ఉత్పత్తి చేసేందుకు సరిపడా స్టీల్‌ను అమెరికా ఉత్పత్తి చేయగలగాలని ట్రంప్ కోరుకుంటున్నారు.
ఉక్కుపై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం టారిఫ్‌లు
అదే ఏడాది, ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్యం (నాఫ్తా)లో అమెరికాతో భాగస్వాములుగా ఉన్న కెనడా, మెక్సికోలతో సహా దిగుమతి చేసుకునే ఉక్కుపై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు డోనల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. నాఫ్తాకు బదులుగా 2020లో యూనైటెడ్ నేషన్స్-మెక్సికో-కెనడా అగ్రిమెంట్‌పై దేశాలు సంతకం పెట్టడంతో ఈ టారిఫ్‌లను ఎత్తివేశారు. ఈ వాణిజ్య ఒప్పందం అమెరికాకు అనుకూలంగా ఉంది. ఈయూపై విధించిన టారిఫ్‌లు ముఖ్యంగా జర్మనీ, నెదర్లాండ్స్‌పై ప్రభావం చూపాయి. ఎందుకంటే, ఈ దేశాలు పెద్ద మొత్తంలో ఉక్కును అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి. అలాగే, ఈయూ కూడా జీన్స్, బార్సన్ విస్కీ, మోటార్ సైకిల్స్ వంటి అమెరికా ఎగుమతులపై టారిఫ్‌లు విధిస్తూ ప్రతీకారం తీర్చుకుంది.
చైనాపై అత్యధిక మొత్తంలో ట్రంప్ టారిఫ్‌లు
అమెరికాతో స్వేచ్చా వాణిజ్య ఒప్పంద ప్రయోజనాన్ని పొందేందుకు అనేక కంపెనీలు ముఖ్యంగా కార్ల తయారీదారులు ఉత్పత్తిని మెక్సికోకు తరలించడమే దీనికి కొంత కారణం. అక్కడ ఉత్పత్తి ఖర్చు తక్కువగా ఉంది. తూర్పు ఆసియాలోని దేశాల నుంచి కూడా అమెరికాకు ఎగుమతులు పెరిగాయి. దీనికి కారణం చైనాపై అత్యధిక మొత్తంలో ట్రంప్ టారిఫ్‌లు విధించడమే. అమెరికా వినియోగదారులకు చైనా ఉత్పత్తులతో పోలిస్తే వారి ఉత్పత్తులు చౌకగా లభ్యమవుతున్నాయి. చాలా చైనా సంస్థలు అమెరికా టారిఫ్‌లను తప్పించుకునేందుకు ఆ దేశాలకు తరలి వెళ్లాయి. టారిఫ్‌ల వల్ల అమెరికాలో స్టీల్, అల్యూమినియం అవుట్‌పుట్ పెరిగిందని పీటర్సన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ పేర్కొంది. కానీ, మెటల్స్ ధరలు పెరిగినట్లు చెప్పింది. దీనివల్ల, ఇతర తయారీ పరిశ్రమల్లో వేల ఉద్యోగాలు పోయాయని వెల్లడించింది.