'ఛావా' సినిమా ప్రభావం.. ఔరంగజేబు సమాధిని తొలగింపుకు యత్నం

chhaava :’ఛావా’ సినిమా ప్రభావం.. ఔరంగజేబు సమాధిని తొలగింపుకు యత్నం

ఛావా’ సినిమా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ సినిమాలో ఔరంగజేబు హిందువులపై చేసిన దాడులు కళ్లకు కట్టినట్టు చూపించారు. దీంతో ఔరంగజేబు సమాధిని తొలగించాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. అంతకు ముందు నుంచే హిందువుల వ్యతిరేకి అయిన ఔరంగజేబు సమాధిని తొలగించాలని కొన్ని సంఘాలు పోరాటం చేస్తున్నాయి. కానీ ‘ఛావా’ సినిమా వచ్చిన తర్వాత ఈ డిమాండ్ మరింత తీవ్రతరం అయింది. ఈ క్రమంలోనే ఔరంగజేబు సమాధిని తొలగించాలని హిందూ సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి.

'ఛావా' సినిమా ప్రభావం.. ఔరంగజేబు సమాధిని తొలగింపుకు యత్నం


నాగ్‌పూర్‌లో హింసాత్మక ఘర్షణలు
దీంతో నాగ్‌పూర్‌లో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. వాహనాలకు నిప్పు పెట్టారు, రాళ్లు రువ్వారు. దీంతో నాగ్‌పూర్‌ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది.సోమవారం నాగ్‌పూర్‌లో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. విశ్వ హిందూ పరిషత్ (VHP) ,బజరంగ్ దళ్ సహా హిందూ సంస్థల సభ్యులు శంభాజీ నగర్‌లోని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలని కోరుతూ నిరసన నిర్వహించారు. అనంతరం ఆందోళనకారులు వాహనాలకు నిప్పంటించారు.
శంభాజీ నగర్‌లో ఉద్రిక్తత పరిస్థితులు
పరిస్థితి మరింత దిగజారిందని, శంభాజీ నగర్‌లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయని , ప్రజా ఆస్తులు దెబ్బతిన్నాయని, వాహనాలకు నిప్పు పెట్టారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే దీనిపై స్పందించిన పోలీసులు అల్లర్లకు పుకార్లే కారణమని తేల్చేశారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని పోలీసులు కోరారు. ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు.
నితిన్ గడ్కరీ స్పందన
ఈ ఘటనపై నాగ్‌పూర్ ఎంపీ నితిన్ గడ్కరీ స్పందించారు. నగరంలో ఉద్రిక్తతల నేపథ్యంలో స్థానిక ప్రజలు ప్రశాంతంగా ఉండాలని గడ్కరీ కోరారు. పుకార్ల కారణంగా,నాగ్‌పూర్‌లో మతపరమైన ఉద్రిక్తత తలెత్తిందని ఆయన అన్నారు. ఇటువంటి సమయంలో శాంతిని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఎవరూ పుకార్లను నమ్మవద్దని , శాంతిని కాపాడుకోవాలని ఆయన కోరారు. ప్రజలు బయటకు రావొద్దని , శాంతిభద్రతల వ్యవస్థకు సహకరించాలని గడ్కరీ అన్నారు.

Related Posts
సింగం అగైన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అజయ్ దేవగన్ మూవీకి ఎన్ని కోట్లంటే,
Singham

బాలీవుడ్‌లో అత్యంత ప్రసిద్ధి చెందిన ఫ్రాంచైజీలలో ఒకటైన సింగం సినిమా సీక్వెల్ సింగం అగైన్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను సాధిస్తోంది. Read more

బండి సంజయ్‌కు – మంత్రి సీతక్క కౌంటర్
బండి సంజయ్‌కు మంత్రి సీతక్క కౌంటర్

బండి సంజయ్ vs మంత్రి సీతక్క: తెలంగాణ అభివృద్ధి పై రాజకీయం తెలంగాణలో జరుగుతున్న రాజకీయ వివాదం కొత్త మలుపు తిరిగింది, మంత్రి సీతక్క కేంద్ర మంత్రి Read more

Narne nithiin;త్వరలోనే పెళ్లి డేట్‌ నిర్ణయం,
narne nithin

‘మ్యాడ్’ సినిమాతో హీరోగా పరిచయమైన ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్‌ ఎంగేజ్‌మెంట్‌ ఇటీవల ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ భార్య ప్రణీత సోదరుడు అయిన నితిన్, ఈ వేడుకలో Read more

Matthew Wade;మాథ్యూ వేడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికేశాడు?
matthew

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాడు మాథ్యూ వేడ్ అధికారికంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు అయితే, అతను బిగ్‌బాష్‌ లీగ్ లో హోబర్ట్ హరికేన్స్ జట్టులో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *