మాస్ యాక్షన్ హీరోగా తనదైన ముద్ర వేసిన తమిళ నటుడు ఆర్. పార్తీబన్, తరువాత దర్శకుడిగా, నిర్మాతగా సినీ పరిశ్రమలో తన ప్రయాణాన్ని కొనసాగించారు. తాజాగా, ‘సుమన్ టీవీ’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితం, విడాకుల నేపథ్యంలో తన భావోద్వేగాలు పంచుకున్నారు.
అసిస్టెంట్
పార్తీబన్ మాట్లాడుతూ, “నా సినిమా ప్రయాణం భాగ్యరాజా గారి దగ్గర అసిస్టెంట్‌గా ప్రారంభమైంది. దర్శకుడిగా మారాలన్న ఆలోచన నాకు అప్పటినుంచే ఉంది” అని చెప్పారు.అయితే, “నా దర్శకత్వంలో సినిమాలు చేయడానికి హీరోలు ముందుకు రాలేదు. అందుకే, నేను నేనే హీరోగా మారాను” అని వివరించారు. అది నా కెరీర్‌కు కీలకమైన నిర్ణయం.
సీతతో ప్రేమ, పెళ్లి, విడాకులు
ఆ సినిమాలో సీత నటించారు. అప్పటికే ఆమె హీరోయిన్ గా 50 సినిమాలు చేశారు. ఆ సినిమా సమయంలోనే మేము ప్రేమించుకోవడం పెళ్లి చేసుకోవడం జరిగిపోయాయి. నేను సీతగారిని ప్రేమించడం పెద్ద విషయం కాదు. కానీ ఆమె నన్ను ఇష్టపడటం గొప్ప విషయమని నేను చెబుతూ ఉంటాను. మా పెళ్లి సమయానికి సీతగారు పెద్ద స్టార్అయినా ఆమెకి ఎంతమాత్రం గర్వం ఉండేది కాదు ఆమె సింప్లిసిటీ చూసి నేను ఆశ్చర్యపోయేవాడిని. పెళ్లైన పదేళ్ల తరువాత మేము విడిపోయాము అని అన్నారు.

భార్యాభర్తలు విడిపోతే కారణం ఏమిటనేది చెప్పడం అంత తేలికైన విషయం కాదు. నాకు కొంచెం ఎమోషన్స్ ఎక్కువ. మేమిద్దరం కలిసున్న ఇంటికి ఆ తరువాత నేను వెళ్లలేదు. మరో సొంత ఇంటిని కొనే ఆలోచన కూడా చేయలేదు. తను మళ్లీ పెళ్లి చేసుకోవడం తన వ్యక్తిగత విషయం ఆ విషయంపై నేను మాట్లాడకూడదు. ఇద్దరమ్మాయిలకు పెళ్లిళ్లు చేశాను. ఒక మంచి హస్బెండ్ గా ఉండలేకపోయినా, ఒక మంచి ఫాదర్ ను అనిపించుకున్నందుకు హ్యాపీగా ఉంది అని చెప్పారు. పార్తీబన్ ప్రస్తుతం తన దర్శకత్వంలో కొత్త సినిమాలకు సన్నాహాలు చేస్తున్నారు. “సినిమా అంటే నాకు ప్యాషన్. నా ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది” అని స్పష్టంచేశారు.పార్తీబన్ జీవితంలో పెద్ద విజయాలు, వ్యక్తిగత మలుపులు, భావోద్వేగాలు అన్ని ఉన్నాయి.