డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సరైన డాక్యుమెంట్లు లేని వలసదారులను అమెరికా నుంచి పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో శరణార్థులు, ఆశ్రయం పొందిన వ్యక్తుల గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
గ్రీన్ కార్డ్
అమెరికా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో భారతీయులు భారీగా నష్టపోనున్నారు. 2023లో 51,000 మందికి పైగా భారతీయులు గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇప్పుడు ప్రాసెసింగ్ తాత్కాలికంగా నిలిపివేయడంతో, వారి భవిష్యత్తు అనిశ్చితిలో పడింది.సిబిఎన్ న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం, శరణార్థులు లేదా ఆశ్రయం పొందిన వారు అమెరికాలో శాశ్వత నివాసం కోసం పెట్టుకున్న అభ్యర్థనలను ట్రంప్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలిపింది.
భారతీయులపై ప్రభావం
ఈ నిర్ణయం భారతీయుల వీసా స్థితిపై తీవ్రమైన ప్రభావం చూపనుంది. గ్రీన్ కార్డ్ కోసం సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న భారతీయులు నిరాశ చెందుతున్నారు.హెచ్ -1బి వీసాదారులు గ్రీన్ కార్డ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో మరింత ఎదురుచూడాల్సి వస్తోంది.గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతుందనే అంశంపై అమెరికా ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.భారతీయులతో పాటు ఇతర దేశాల వలసదారులు కూడా దీని ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు.గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులు ప్రాసెస్‌లో కొత్త మార్పులను సమీక్షిస్తూ ఉండాలి.ప్రస్తుత వీసా రూల్స్‌కి అనుగుణంగా కొత్త మార్గాలను అన్వేషించాలి.

భారీ షాక్
ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం భారతీయ వలసదారులకు భారీ షాక్. గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ నిలిచిపోవడం వల్ల వందలాది మంది భారతీయులు అనిశ్చితిలో ఉన్నారు. వచ్చే రోజుల్లో అమెరికా ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ప్రకటిస్తుందా? లేక వలసదారులపై మరింత కఠిన చర్యలు తీసుకుంటుందా? అనే ప్రశ్న ఉత్కంఠ రేపుతోంది.
ప్రయోజనాలు
అమెరికాలో శాశ్వత నివాసం – ఎటువంటి పరిమితులూ లేకుండా అమెరికాలో ఉండవచ్చు.ఉద్యోగ అవకాశాలు – అమెరికా కంపెనీలలో పనిచేయవచ్చు.అత్యవసర ప్రయోజనాలు – ప్రభుత్వ సహాయ కార్యక్రమాలకు అర్హత ఉంటుంది.పౌరసత్వం పొందే అవకాశం – కొన్ని సంవత్సరాల తర్వాత అమెరికా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు.కుటుంబ సభ్యులను స్పాన్సర్ చేయొచ్చు – జీవిత భాగస్వామి, పిల్లలకు గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేయవచ్చు.
శాశ్వత నివాస
గ్రీన్ కార్డ్ హోల్డర్ అంటే అమెరికాలో శాశ్వత నివాస హక్కు పొందిన వ్యక్తి. దీనిని పర్మనెంట్ రెసిడెంట్అని కూడా పిలుస్తారు. గ్రీన్ కార్డ్ ఉంటే, ఆ వ్యక్తి అమెరికాలో నివసించే, ప్రయాణించే హక్కు పొందుతాడు. అయితే, ఇది పూర్తి పౌరసత్వం కాదు, అమెరికా పౌరుడికి ఉన్న కొన్ని హక్కులు గ్రీన్ కార్డ్ హోల్డర్‌కు ఉండవు.