📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు

Health:మహిళల్లో పెరుగుతున్న గుండె జబ్బులు

Author Icon By Anusha
Updated: April 4, 2025 • 4:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవలి కాలంలో మహిళల్లో హృద్రోగ సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా, ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని ప్రారంభ లక్షణాలను నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం.గుండె జబ్బులను ముందుగా గుర్తించలేకపోతున్నారు.గుండెపోటు అనేది తీవ్రమైన ఆరోగ్య సమస్య. ఇది అకస్మాత్తుగా సంభవించవచ్చు. చాలా సందర్భాలలో ప్రాణాంతకం కావచ్చు. గుండెకు రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడి, గుండె కండరానికి నష్టం వాటిల్లినప్పుడు ఇది సంభవిస్తుంది. గుండెపోటు లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. మరికొన్నింటిని గుర్తించకపోవచ్చు. ఈ రోజుల్లో పురుషుల కన్నా మహిళల్లో ఎక్కువగా గుండెపోటు వస్తుంది. మహిళల్లో గుండెపోటు హెచ్చరిక సంకేతాలు కొంచెం భిన్నంగా,ఉంటాయి. అందుకే వాటిని గుర్తించడంలో ఆలస్యం జరుగుతుంది.

లక్షణాలు

చాలామంది మహిళలు గుండెజబ్బు లక్షణాలను జీర్ణ సమస్యలుగా పొరబడుతుంటారు. వికారంగా ఉండటం, వాంతులు, ఛాతీలో మంటను గ్యాస్‌, అల్సర్‌గా భావిస్తారు. అయితే, ఇలా కడుపులో అసౌకర్యంగా ఉండటం కూడా గుండె సమస్యకు సంకేతమే,ఎలాంటి శారీరక శ్రమ లేకపోయినా కొందరిలో అకస్మాత్తుగా చెమటలు పడుతుంటాయి. కానీ, చాలామంది ఆందోళనతో వచ్చే చెమటగా భావిస్తుంటారు. గుండెపోటు వచ్చేముందు చెమటలు పడుతుంటాయి.మహిళల్లో ఎక్కువగా మెడ, దవడ, వీపు పైభాగంలో, భుజాలలో అసౌకర్యంగా ఉంటుంది. కానీ, చాలామంది కండరాల ఒత్తిడిగా భావిస్తుంటారు. చికిత్సలో నిర్లక్ష్యం చేస్తుంటారు.తేలికపాటి పని చేసినా కొందరిలో శ్వాస ఆడదు.

గుండెపోటు

ఈ సమస్యను ఆందోళన, శ్వాసకోశ సమస్యగా పొరపాటు పడుతుంటారు. వైద్య సేవలకు నిరాకరిస్తారు. ఇదికూడా గుండె సమస్యకు సంకేతమే.బలహీనంగా ఉండటం, తల తిరగడం, స్పృహ కోల్పోతున్నట్లు అనిపించడం కూడా గుండె సమస్యకు సంకేతమే. సరిగ్గా తినకపోయినా ఇలాంటి సమస్యలే కనిపిస్తాయి.పురుషులలో, గుండెపోటు నొప్పి సాధారణంగా ఎడమ ఛాతికి వస్తుంది.హార్ట్ స్ట్రోక్ వచ్చే ముందు స్త్రీలలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఛాతీలో నొప్పి, శ్వాస ఆడకపోవడం, వికారం, వాంతులు, అలసట, భుజాలు, మెడ, వీపు, లేదా ఎడమ చేయిలో నొప్పి, నిద్రలేమి. ఈ నొప్పి ఎటువంటి కారణం లేకుండా వస్తే దానిని లైట్ తీసుకోవద్దు.

మహిళలు గుండె జబ్బులను ఎలా నివారించుకోవాలి

క్రమంగా హృదయపరీక్షలు చేయించుకోవాలి,ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి,రోజూ వ్యాయామం, యోగా చేయడం ద్వారా హృద్రోగాన్ని నివారించవచ్చు,ధూమపానం, మద్యపానం తగ్గించాలి,శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి.ఆహార నియంత్రణ – కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచండి.నిత్యం వ్యాయామం చేయండి – రోజుకు కనీసం 30 నిమిషాలు.ధూమపానం, మద్యం వీలైనంత వరకు మానుకోండి.స్ట్రెస్ తగ్గించుకోండి – మెదడుకు విశ్రాంతి అవసరం.

గమనిక

ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించేముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.

#CardiacCare #HeartDiseaseAwareness #HeartHealth #PreventHeartDisease #StayHealthy #WomenHeartHealth Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.