📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు

Health: తరచుగా తల తిరిగినట్లు అనిపిస్తుందా అయితే ఈ చిట్కాలు మీకోసమే

Author Icon By Anusha
Updated: April 8, 2025 • 5:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అకస్మాత్తుగా లేచినప్పుడు చాలా మందికి తల తిరుగుతున్నట్లుగా అనిపించడం ఒక సాధారణమైన సమస్య. అయితే ఇది చిన్న సమస్యగా తీసుకోవద్దు. దీని వెనుక కొన్ని ఆరోగ్యపరమైన కారణాలు ఉండొచ్చు.ఇవి తాత్కాలికంగా ఉండొచ్చు లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల సంకేతంగా కూడా ఉండొచ్చు. ఈ సమస్యను సరైన వైద్య పరిజ్ఞానం ద్వారా అర్థం చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే నివారించవచ్చు.వెర్టిగో అనేది తరచుగా తల తిరుగడానికి ప్రధాన కారణంగా పేర్కొనబడుతుంది.చెవి లోపల చిన్న కణాలు తారుమారు అయి శరీర సమతుల్యాన్ని ప్రభావితం చేస్తాయి. దీంతో వ్యక్తి స్థిరంగా ఉండగలిగినా అంతర్గతంగా తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది.శరీరానికి అవసరమైన మేరకు ద్రవాలు అందకపోతే రక్తం ప్రసరణ మెల్లగా జరగడం మొదలవుతుంది.ఇది తల తిరిగినట్లు అనిపించడానికి కారణమవుతుంది. వేసవి కాలంలో అధికంగా చెమట విడుదలవ్వడం, నీరు తక్కువగా తాగడం వంటి అలవాట్లు ఈ సమస్యకు దారి తీస్తాయి.అకస్మాత్తుగా లేచినప్పుడు తల తిరగడం చాలా మందిలో కనిపించే సమస్య. ఇది తరచూ ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు.

గుండె పంపింగ్

కొన్ని రకాల మందులు ముఖ్యంగా మానసిక ఒత్తిడికి సంబంధిత ఔషధాలు, నిద్రలేమి మందులు లేదా రోగనిరోధక మందులు కూడా తల తిరుగడాని కి కారణమవుతాయి. దీన్ని గమనించి మీరు ఉపయోగిస్తున్న మందులపై డాక్టర్‌ను సంప్రదించడం అవసరం.స్లీప్ అప్నియా ఉన్నవారిలో రాత్రివేళ శ్వాస సవ్యంగా జరగకపోవడంతో మెదడుకు అవసరమైన ఆక్సిజన్ సరిపడా చేరదు.రోజు సమయంలో అలసట, తల తిరుగుట వంటి లక్షణాలు కనిపించవచ్చు.గుండె సమస్యలు ఉన్నవారికి రక్త సరఫరా సరైన స్థాయిలో జరగకపోవడం వల్ల తల తిరుగుతుంది.ఇది ముఖ్యంగా గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గినప్పుడు లేదా హృదయ సంబంధ సమస్యలు ఉన్నప్పుడు కనిపిస్తుంది. ఇది తీవ్రమైన సమస్య కావచ్చు కాబట్టి డాక్టర్‌ను సంప్రదించాలి.మహిళలలో నెలసరి సమయంలో లేదా మెనోపాజ్ సమయంలో ఎస్ట్రోజన్ లెవెల్స్ మారటం వల్ల తల తిరిగినట్లు అనిపించవచ్చు. ఇది తాత్కాలికంగా ఉండే పరిస్థితి అయినా పదే పదేఇలా జరిగితే వైద్య సలహా తీసుకోవడం చాలా అవసరం.

నివారణ చిట్కాలు

రోజూ సమయానికి తగినంత నీరు తాగడం,ఒత్తిడిని తగ్గించే యోగా, ధ్యానం చేయడం,నిద్ర పట్టే విధంగా జీవన విధానంలో మార్పులు,ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం,మితంగా వ్యాయామం చేయడం,అవసరమైతే వైద్య పరీక్షలు చేయించుకోవడం, చాలా అవసరం.అలసటగా ఉన్నప్పుడు ఎక్కువ సమయం నిద్ర పడుకోవడం మంచిది.లక్షణాలు ఎక్కువగా, తరచూ ఉంటే డాక్టర్‌ను సంప్రదించండి.

Read Also:Dry fruits: అంజీర్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు

#BPPV #Dizziness #InnerEarBalance #LowBloodPressure #OrthostaticHypotension #Vertigo Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Telugu News Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.