: యూనస్ కు వార్నింగ్ ఇచ్చిన హసీనా

Sheikh Hasina: యూనస్ కు వార్నింగ్ ఇచ్చిన హసీనా

బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం, స్వేచ్ఛ కోసం పోరాడుతూ ఎంతోమంది ప్రాణత్యాగం చేశారని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా పేర్కొన్నారు. నాటి అమరుల త్యాగాలను నేటి తరానికి చాటిచెప్పేందుకు జిల్లా కేంద్రాల్లో తమ ప్రభుత్వం ‘ముక్తి జోధా కాంప్లెక్స్’లను నిర్మించినట్లు తెలిపారు. అయితే, ప్రస్తుతం అధికారంలో ఉన్న తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ యూనస్ మాత్రం అమరుల జ్ఞాపకాలను తుడిచివేస్తున్నారని మండిపడ్డారు. అల్లరి మూకలను రెచ్చగొట్టి ముక్తి జోధా కాంప్లెక్స్ లను నాశనం చేయిస్తున్నారని ఆరోపించారు.

Advertisements
: యూనస్ కు వార్నింగ్ ఇచ్చిన హసీనా

చరిత్రను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపాటు
స్వాతంత్ర్య సమరయోధుల ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారని, చరిత్రను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం బంగ్లాదేశ్ ప్రజలను ఉద్దేశించి హసీనా ఓ వీడియోను విడుదల చేశారు. బంగ్లాదేశ్ లో చెలరేగిన అల్లర్ల కారణంగా హసీనా దేశం విడిచిపెట్టాల్సి వచ్చింది. భారత్ లో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. హసీనా వెళ్లిపోయిన తర్వాత బంగ్లాదేశ్ లో నోబెల్ గ్రహీత డాక్టర్ మహమ్మద్ యూనస్ సలహాదారుగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయినప్పటికీ అల్లర్లు పూర్తిగా సద్దుమణగకపోవడం, హసీనాపై పలు నేరారోపణలు, అరెస్టు వారెంట్ లు జారీ కావడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.
యూనస్ పై ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజం
బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలపై హసీనా ఎప్పటికప్పుడు స్పందిస్తూ దేశ ప్రజలను ఉద్దేశించి వీడియో సందేశాలు విడుదల చేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన వీడియోలో యూనస్ పై ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అధికార దాహంతో యూనస్ చరిత్రను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిప్పుతో చెలగాటమాడితే అది నిన్నే కాల్చేస్తుందని యూనస్ ను హెచ్చరించారు. త్వరలోనే తాను తిరిగి వస్తానని, అందుకోసమే తాను ఇంకా ప్రాణాలతో ఉన్నానని హసీనా చెప్పారు.

Read Also: ISS: రాత్రివేళ మెరిసిపోతూ కనిపించిన భారత్… ఫొటోలు విడుదల

Related Posts
Property Tax : ఆస్తి పన్ను వడ్డీ బకాయిల్లో 50 శాతం రాయితీ
Mega DSC Notification in March .. AP Govt

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆస్తి పన్ను బకాయిదారులకు మున్సిపల్ శాఖ శుభవార్త అందించింది. పలు నగరాలు, పట్టణాల్లో ఆస్తి పన్ను బకాయిలు అధికంగా పేరుకుపోవడంతో ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. Read more

‘గో ఫర్ ఫ్రీడమ్ గోల్డ్ ఆఫర్ 2024’
Freedom Healthy Cooking Oils to Honor Winners of 'Go for Freedom Gold Offer 2024' Bumper Draw

హైదరాబాద్‌ : దేశంలోని ప్రముఖ వంట నూనెల బ్రాండ్ అయిన ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్, తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ కోసం ‘గో ఫర్ ఫ్రీడమ్ గోల్డ్ Read more

Good Friday :యేసయ్య సిలువ త్యాగానికి స్మరణదినం
Good Friday :యేసయ్య సిలువ త్యాగానికి స్మరణదినం

గుడ్ ఫ్రైడే – ప్రభువు ప్రేమకు స్మరణార్థం నేడు ‘గుడ్ ఫ్రైడే’. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఈ రోజును యేసుక్రీస్తు సిలువలో మరణించిన రోజుగా గుర్తుచేసుకుంటూ, ఆయనకు ఆరాధనలు Read more

కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ పై దాడి
Attack on Congress leader F

కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ పై దాడి జరిగింది. హైదరాబాద్లోని ఆసిఫ్ నగర్లో ఎంఐఎం కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. సీసీ రోడ్డు పరిశీలనకు వచ్చిన ఆయన్ను ఎమ్మెల్యే Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×