हिन्दी | Epaper
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Gold Prices Today: రూ. 16 వేలకు పైగా తగ్గిన బంగారం ధరలు

Vanipushpa
Gold Prices Today: రూ. 16 వేలకు పైగా తగ్గిన బంగారం ధరలు

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్(Good News).. ఈ రోజు కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ మధ్య ఆకాశాన్ని తాకిన పసిడి ధరలు(Gold Rates) రోజు వారీగా తగ్గుతూ వస్తున్నాయి. గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు రూ. 16, 000కు తగ్గాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(America President Donald Trump) సంచలన ప్రకటన చేయడంతో బంగారం ధరలు నింగి నుంచి నేల చూపులు చూశాయి. ఇక పెట్టుబడిదారులు ఇజ్రాయెల్-ఇరాన్(Israel-Iran) వార్ వదిలేసి యూస్ డాలర్(Dollar) మీద ఫోకస్ పెట్టడంతో బంగారంపై డిమాండ్ తగ్గింది. దీంతో బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఇదే పరిస్థితులు కొనసాగితే రానున్న కాలంలో ఈ ధరలు మరింతగా తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మళ్లీ యుద్దం ?
అయితే పరిస్థితుల మళ్లీ మారేలా కనిపిస్తున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మళ్లీ యుద్దం మొదలయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని పలువురు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ దేశాల మధ్య కాల్పులు విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే రెండు దేశాలు మళ్లీ కయ్యానికి కాలు దువ్వినట్లుగా తెలుస్తోంది. దీంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్‌ ఉల్లంఘించిందని దానికి గట్టిగా బుద్ధి చెబుతామని ఇజ్రాయెల్ హెచ్చరికలు చేసింది. ఇక ఇరాన్ కూడా దానికి ధీటుగానే బదులిచ్చింది. ఇజ్రాయెల్‌ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరికలు పంపింది.

Gold Prices Today: రూ. 16 వేలకు పైగా తగ్గిన బంగారం ధరలు
Gold Prices Today: రూ. 16 వేలకు పైగా తగ్గిన బంగారం ధరలు

ఈ పరిస్థితుల మధ్య పెట్టుబడిదారులు మళ్లీ బంగారం సురక్షితం అంటూ దాని వైపు తమ ద‌ృష్టిని కేంద్రీకరిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇన్వెస్టర్లు బంగారం సురక్షితం అనే డిమాండ్ కు వస్తారని అంచనా వేస్తున్నారు. జూన్ 23 ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ తర్వాత బంగారంతో పాటు ముడి చమురు ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. మళ్లీ ఉద్రిక్తతలు పెరిగితే వీటి ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. హార్ముజ్ జలసంధి మూసివేతపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం స్వచ్ఛమైన పెట్టుబడి-గ్రేడ్ బంగారం అయిన 24 క్యారెట్ బంగారం ధర గ్రాముకు రూ.9,895 వద్ద ట్రేడ్ అవుతోంది.
గురువారం బంగారం ధరలు
జూన్ 26వ తేదీ గురువారం బంగారం ధరలను మనం పరిశీలిస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.98,950 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,700 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,210 వద్ద ట్రేడ్ అవుతోంది. భవిష్యత్తులో బంగారం ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డాలర్ బలహీనపడటం, ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న రాజకీయ పరిస్థితులు, పశ్చిమాసియా దేశాల్లో తగ్గిన ఉద్రిక్తతలు వంటి వాటితో బంగారం ధరలు ఈ సారి తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

నేడు బంగారం ధరలు
హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,950 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.90,700 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,210 గా నమోదైంది. విజయవాడ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,950 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.90,700 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,210 గా నమోదైంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,950 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,950 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.90,700 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,210 గా నమోదైంది. ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,100 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,850 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,340 నమోదైంది.

బెంగుళూరులో..

బెంగుళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,950 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.90,700 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,210 గా నమోదైంది. కలకత్తా విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,950 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.90,700 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,210 గా నమోదైంది.

Read Also: Stock market: ఆద్యంతం లాభాల్లోనే సూచీలు..

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870