దేశ చరిత్రలో తొలిసారిగా రూ.50 లక్షల కోట్లు దాటిన బడ్జెట్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో 8వ పర్యాయం కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా కేంద్ర బడ్జెట్ రూ.50 లక్షల కోట్ల మార్కును దాటింది. 2025-26 సంవత్సరానికి గాను కేంద్ర వార్షిక బడ్జెట్ రూ.50,65,345 కోట్లు అని నిర్మలా సీతారామన్ పార్లమెంటు వేదికగా ప్రకటించారు. ఈసారి రెవెన్యూ లోటు రూ.5.23 లక్షల కోట్లు కాగా, ద్రవ్య లోటు రూ.15.68 లక్షల కోట్లు. 2025-26లో మూలధన వ్యయం రూ.11.2 లక్షల కోట్లు కాగా… స్థూల పన్ను రాబడి రూ.42.7 లక్షల కోట్లు అని నిర్మల వివరించారు. కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.10.82 లక్షల కోట్లు కాగా, జీఎస్టీ సెస్ వసూళ్లు రూ.1.67 లక్షల కోట్లు, ఎక్సైజ్ పన్ను వసూళ్లు రూ.3.17 లక్షల కోట్లు అని వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మార్కెట్లో రూ.15.82 లక్షల కోట్ల రుణాలు తీసుకోనుంది.

Advertisements

Related Posts
గుకేష్ చరిత్రాత్మక విజయం: చెన్నైలో ఘన స్వాగతం
gukesh

గుకేష్, ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా గెలిచారు. అతను డింగ్ లిరెన్‌ను ఫైనల్‌లో ఓడించి ఈ ఘనత సాధించాడు. ఫైనల్ రౌండ్‌లో 7.5 - 6.5 పాయింట్లతో లిరెన్‌ను Read more

Smiley Face : ఏప్రిల్ 25న ఆకాశంలో ‘స్మైలీ ఫేస్’ అపూర్వ దృశ్యం
The moon and smiley star

ఈ నెల 25న తెల్లవారుజామున ఆకాశంలో ఒక అద్భుతం చోటుచేసుకోనుంది. ప్రకృతి మనకు ఈసారి అసలైన "స్మైలీ" చూపించబోతోంది. శుక్రుడు, శని మరియు నెలవంక కలిసి ఆకాశంలో Read more

Asaduddin Owaisi : అమాయకుల ప్రాణాలు తీయడం హేయమైన చర్య: ఒవైసీ స్పందన
Asaduddin Owaisi అమాయకుల ప్రాణాలు తీయడం హేయమైన చర్య ఒవైసీ స్పందన

జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై అల్లిండియా మజ్లిస్-ఇ-ఇత్తేహాదుల్ ముస్లిమీన్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. అమాయకులపై తుపాకీలు ఎక్కించడం ఎంత Read more

ఢిల్లీ ఎన్నికలు – జోరుగా బెట్టింగ్ లు
rahul modi kejriwal

చాలా కాలం తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు హోరీహోరీగా జరుగుతున్నాయి. వరుసగా మూడుసార్లు గెలిచి అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి విపక్ష బీజేపీ నుంచి గట్టి Read more

Advertisements
×