దేశ చరిత్రలో తొలిసారిగా రూ.50 లక్షల కోట్లు దాటిన బడ్జెట్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో 8వ పర్యాయం కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా కేంద్ర బడ్జెట్ రూ.50 లక్షల కోట్ల మార్కును దాటింది. 2025-26 సంవత్సరానికి గాను కేంద్ర వార్షిక బడ్జెట్ రూ.50,65,345 కోట్లు అని నిర్మలా సీతారామన్ పార్లమెంటు వేదికగా ప్రకటించారు. ఈసారి రెవెన్యూ లోటు రూ.5.23 లక్షల కోట్లు కాగా, ద్రవ్య లోటు రూ.15.68 లక్షల కోట్లు. 2025-26లో మూలధన వ్యయం రూ.11.2 లక్షల కోట్లు కాగా… స్థూల పన్ను రాబడి రూ.42.7 లక్షల కోట్లు అని నిర్మల వివరించారు. కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.10.82 లక్షల కోట్లు కాగా, జీఎస్టీ సెస్ వసూళ్లు రూ.1.67 లక్షల కోట్లు, ఎక్సైజ్ పన్ను వసూళ్లు రూ.3.17 లక్షల కోట్లు అని వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మార్కెట్లో రూ.15.82 లక్షల కోట్ల రుణాలు తీసుకోనుంది.

Advertisements

Related Posts
మోదీని ఓడించే కుట్రలో వీణా రెడ్డి పాత్రపై అనుమానాలు
మోదీని ఓడించే కుట్రలో వీణా రెడ్డి పాత్రపై అనుమానాలు

అగ్రరాజ్యం అమెరికాకు స్వప్రయోజనాలే పరమావధి. దీని కోసం ఏ స్థాయికన్నా దిగజారుతుంది. స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బయటపెట్టిన సంచలన విషయాలతో మరోసారి ఇది నిజమేనని Read more

పని గంటల పెంపుపై కేంద్రం స్పష్టమైన వైఖరి
పని గంటల పెంపుపై కేంద్రం స్పష్టమైన వైఖరి

పని గంటలను వారానికి 70 లేదా 90 గంటలకు పెంచే ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది. ఇటువంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో Read more

Suresh Raina: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ కు ఫిధా అయిన సురేష్ రైనా
Suresh Raina: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ కు ఫిధా అయిన సురేష్ రైనా

ఐపీఎల్ 2025 సీజన్‌లో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ తన తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు.14 ఏళ్లకే ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన Read more

NHRC చీఫ్ నియామకంపై కాంగ్రెస్ ఆందోళన
NHRC చీఫ్ నియామకంపై కాంగ్రెస్ ఆందోళన

మానవ హక్కుల ప్యానెల్ చీఫ్ నియామకంపై కాంగ్రెస్ అసంతృప్తి కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ మరియు మల్లికార్జున్ ఖర్గే జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) చైర్‌పర్సన్ Read more

Advertisements
×