గర్భం ధరించినప్పుడు మహిళ తన ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనివార్యం. ముఖ్యంగా, ఆహారంలో శరీరానికి అవసరమైన పోషకాలు సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలి. ఏ సీజన్‌లో ఏం తినాలి అనే దానిపై నిపుణులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. గర్భిణులు తీసుకునే ఆహారంలో ముఖ్యంగా బి12, మాంగనీస్, కాపర్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటే, మధ్య వయసులో బీపీ సమస్య తగ్గే అవకాశం ఉందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిర్వహించిన పరిశోధనలు తెలియజేస్తున్నాయి.

గర్భిణుల ఆరోగ్యానికి మేలు చేసే ముఖ్యమైన ఖనిజాలు
కేవలం గర్భిణులే కాదు, ఆరోగ్యంగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో మాంగనీస్, మెగ్నీషియం, కాపర్, సెలీనియం వంటి ఖనిజాలను చేర్చుకోవడం అవసరం. ఇవి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడేటివ్ గుణాలు కలిగి ఉండటంతో గుండె సంబంధిత సమస్యల నుంచి రక్షణ అందిస్తాయి. ఈ పరిశోధనలో భాగంగా, 20 సంవత్సరాల క్రితం కొందరు గర్భిణుల రక్తంలో ఖనిజాల స్థాయిని అంచనా వేశారు. వారి ఆరోగ్యాన్ని 51 ఏళ్ల వయస్సు వచ్చాక పరిశీలించగా, గర్భిణుల సమయంలో మాంగనీస్, కాపర్ ఎక్కువగా తీసుకున్న వారికి బీపీ సమస్య 25% తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా, బి12 ఎక్కువగా తీసుకున్న మహిళల్లో లో బీపీ (Low BP) కనిపించిందని పరిశోధకులు వెల్లడించారు. శరీరానికి అవసరమైన పోషకాలను సహజమైన ఆహార పదార్థాల ద్వారా పొందడం ఉత్తమం. నిపుణులు సూచించిన ఆహార జాబితా-బి12 సమృద్ధిగా లభించే ఆహారాలు – చేప, చికెన్, గుడ్డు, పాల ఉత్పత్తులు. కాపర్ అధికంగా ఉండే ఆహారాలు – ఆకుకూరలు, పిస్తా, జీడిపప్పు, బాదం, గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు. మాంగనీస్‌ను అధికంగా కలిగిన ఆహారాలు – పాలకూర, హేజల్ నట్స్, బ్రౌన్ రైస్, శనగలు, పైనాపిల్, ముడిగోధుమలు. గర్భిణుల ఆరోగ్యం మంచిగా ఉండటానికి ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం, విటమిన్-డి, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, బి, సి విటమిన్లు, ప్రొటీన్ అవసరమని డాక్టర్ సూచిస్తున్నారు. వీటిని పొందేందుకు పండ్లు, కూరగాయలు, ముడిధాన్యాలు, పాల ఉత్పత్తులు, గింజలు, నట్స్, లీన్ ప్రోటీన్ వంటి ఆహారాలను సమతులంగా తీసుకోవాలి. గర్భం దాల్చాక ఏ సీజన్‌లో ఏం తినాలి అనేది శరీర అవసరాలను బట్టి నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా, మాంగనీస్, కాపర్, బి12 లాంటి ఖనిజాలు సరైన మోతాదులో తీసుకుంటే, భవిష్యత్‌లో రక్తపోటు సమస్యలు తగ్గే అవకాశముందని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే, ఏ పోషకాలైనా మితంగా తీసుకోవాలి. ఆరోగ్య నిపుణుల సిఫార్సు మేరకు గర్భిణులు రోజుకి 1.7 మి.గ్రా కాపర్, 4 మి.గ్రా మాంగనీస్, 2.45 మై.గ్రా బి12 మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు.