ఛాంపియన్స్ ట్రోఫీ పై ఐదు వేల కోట్ల బెట్టింగ్

ఛాంపియన్స్ ట్రోఫీ పై ఐదు వేల కోట్ల బెట్టింగ్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భాగంగా భారత్ ,న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ మరికొద్ది గంటల్లో జరగనుంది. ఈ క్రికెట్ మెగా ఈవెంట్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, మరోవైపు బెట్టింగ్ మాఫియా భారీ స్థాయిలో చేతులు కలిపినట్టు పోలీసులు గుర్తించారు. ఢిల్లీ క్రైం బ్రాంచ్ విశ్వసనీయ సమాచారం మేరకు బెట్టింగ్ రాకెట్‌ను ఛేదించి ఐదుగురు కీలక బుకీలను అరెస్ట్ చేసింది.

Advertisements

బెట్టింగ్

ఈ హై-ప్రొఫైల్ మ్యాచ్‌లో భారత్ జట్టు ఫేవరెట్ కావడంతో భారీగా బెట్టింగ్ జరిగిందని పోలీసులు వెల్లడించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం, రూ.5000 కోట్లకు పైగా బెట్టింగ్ దందా జరిగినట్లు సమాచారం. దీనికి అండర్ వరల్డ్ గ్రూప్ ‘డి కంపెనీ’ (దావూద్ ఇబ్రహీం మాఫియా నెట్‌వర్క్) సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

బుకీల అరెస్ట్

శనివారం నాడు ఢిల్లీ క్రైం బ్రాంచ్ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి, కీలకమైన ఇద్దరు బుకీలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. అరెస్టైన వారిలో ప్రవీణ్ కొచ్చర్, సంజయ్ కుమార్ ఉన్నారు. వారి వద్ద నుండి ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఈ ఇద్దరూ ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ద్వారా పెద్ద స్థాయిలో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తేలింది.

INDIA NEW ZEALAND FINAL

దుబాయ్ నుంచి బెట్టింగ్ కంట్రోల్

విచారణలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. బెట్టింగ్ ముఠా దుబాయ్‌లోని గ్యాంగ్‌ల ద్వారా నియంత్రణలో ఉందని,ప్రతి మ్యాచ్‌కు రూ.40,000 కమీషన్ తీసుకుంటున్నారని బుకీలు అంగీకరించారు. ఈ వ్యాపారాన్ని రెండేళ్లుగా గోప్యంగా నడుపుతూ, ప్రత్యేకంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.రెండేళ్లుగా నెలకు రూ.30 వేలు చెల్లించి ఓ ఇంటిని ప్రత్యేకంగా ఈ దందా కోసమే అద్దెకు తీసుకున్నట్లు ప్రవీణ్ చెప్పాడు. ఆన్ లైన్ లో, మొబైల్ ఫోన్ల ద్వారా ఆఫ్ లైన్ లోనూ బెట్టింగ్స్ స్వీకరిస్తామని వివరించాడు. కాగా, వీరిద్దరితో పాటు వెస్ట్ ఢిల్లీకి చెందిన ఛోటూ బన్సాల్, మోతీనగర్ కు చెందిన వినయ్, మరొక బుకీని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

అరెస్ట్

ఈ కేసులో మరో ముగ్గురు ప్రధాన నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఛోటూ బన్సాల్ (వెస్ట్ ఢిల్లీ).వినయ్ (మోతీనగర్).ఇంకొక బుకీ.

సెమీ ఫైనల్ పైన బెట్టింగ్

ఈ ముఠా ఇంతకు ముందే జరిగిన ఆస్ట్రేలియా ,భారత్ సెమీ ఫైనల్ పైన కూడా బెట్టింగ్ నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు. వారు ఉపయోగించిన ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు, వెబ్‌సైట్లు, డార్క్‌నెట్ కనెక్షన్లు పోలీసులు పరిశీలిస్తున్నారు.

అండర్ వరల్డ్ లింక్‌పై దర్యాప్తు

ఈ బెట్టింగ్ రాకెట్ వెనుక అండర్ వరల్డ్ గ్రూప్ ‘డి కంపెనీ’ హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై ఇంకా తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలో ఇంకా కీలక అరెస్టులు జరిగే అవకాశం ఉందని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

పోలీసుల అప్రమత్తత

భారీ స్థాయిలో బెట్టింగ్ జరుగుతుండటంతో ఢిల్లీ, ముంబై, దుబాయ్ లాంటి కీలక నగరాల్లో పోలీసులు నిఘా పెంచారు. క్రికెట్ మాఫియాపై అదనపు దాడులకు కూడా పోలీసులు సిద్ధమవుతున్నారు.

Related Posts
కుంభమేళాలో రూ.30 కోట్లు సంపాదించిన ఓ కుటుంబం : సీఎం
A family earned Rs. 30 crores at the Kumbh Mela.. CM

లక్నో: రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అసెంబ్లీలో మహా కుంభమేళా పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు గట్టిగా బదులిచ్చారు. కుంభమేళా వల్ల ఎంతోమంది Read more

Hyderabad:మీర్‌పేట హత్య కేసు వెలుగులోకి మరిన్ని సంచలన విషయాలు
Hyderabad:మీర్‌పేట హత్య కేసు వెలుగులోకి మరిన్ని సంచలన విషయాలు

తెలంగాణ లో సంచలనం సృష్టించిన మీర్‌పేట హత్యకేసు తాజాగా మరో మలుపు తిరిగింది. గురుమూర్తి తన భార్య వెంకట మాధవిని హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి, Read more

మరో రెండు విమానాల్లో రానున్న భారతీయులు
Indians coming in two more flights

అక్రమ వలసదారుల డిపోర్టేషన్ న్యూఢిల్లీ: అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించే కార్యక్రమం చేపట్టిన అమెరికా కొందరు భారతీయులను ఇటీవల పంపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో, మరో Read more

Zuckerberg: చిక్కుల్లో మెటా సంస్థ.. జుకర్‌బర్గ్‌ ఎలా బయటికి వస్తారో!
చిక్కుల్లో మెటా సంస్థ.. జుకర్‌బర్గ్‌ ఎలా బయటికి వస్తారో!

టెక్ ప్రపంచంలో గొప్ప పేరు సంపాదించిన మెటా సంస్థ ఇప్పుడు చరిత్రలోనే అతిపెద్ద యాంటీ ట్రస్ట్ విచారణను ఎదుర్కొంటోంది. సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌పై అమెరికా ఫెడరల్ ట్రేడ్ Read more

×