Fatal road accident in Saudi Arabia.. 9 Indian citizens killed

ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది భారత పౌరులు మృతి

సౌదీ ఆరేబియా: సౌదీ ఆరేబియా లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది భారత పౌరులు దుర్మరణం పాలయ్యారు. సౌదీ అరేబియా పశ్చిమ ప్రాంతంలోని జిజాన్‌ నగరంలో ఈ ప్రమాదం జరిగింది. జెడ్డా లోని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. బాధిత కుటుంబాలకు తాము అండగా ఉంటామని, స్థానిక అధికారులతో బాధిత కుటుంబాలతో తాము ఘటనపై ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నది.

ప్రమాదంపై బాధిత కుటుంబాలు సమాచారం తెలుసుకోవడం కోసం అక్కడి భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్‌ నెంబర్‌లను కూడా ఏర్పాటు చేసింది. సమాచారం కోసం 8002440003 (Toll free), 0122614093, 0126614276, 0556122301 (WhatsApp) నెంబర్లలో సంప్రదించాలని సూచించింది. కాగా ప్రమాదంపై భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ స్పందించారు. సౌదీ రోడ్డు ప్రమాదంలో భారత పౌరులు ప్రాణాలు కోల్పోయిన వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు.

జెడ్డాలోని రాయబార కార్యాలయంతో తాను మాట్లాడానని, ప్రమాదం గురించి సమాచారం అడిగి తెలుసుకున్నానని విదేశాంగ మంత్రి జైశంకర్‌ చెప్పారు. భారత రాయబార కార్యాలయం బాధిత కుటుంబాలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతోందని అన్నారు. ఈ విషాద పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకు తమ పూర్తి సహకారం ఉంటుందని ఆయన తన అధికారిక ఎక్స్‌ (X) ఖాతాలో పేర్కొన్నారు.

Related Posts
బైడెన్ యొక్క EV విధానాలను తిరస్కరించేందుకు ట్రంప్ ప్రణాళికలు
biden

ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్, ప్రెసిడెంట్ జో బైడెన్ యొక్క ఎలక్ట్రిక్ వాహన (EV) విధానాలను తీయాలని నిర్ణయించారు. ఇది అమెరికా ఆటో పరిశ్రమ మరియు ఉద్యోగ మార్కెట్ Read more

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
sangareddy bike accident

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా గణేశ్ పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కర్ణాటక ఆర్టీసీ బస్సు ఓ బైక్ ను ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి Read more

ఫిబ్రవరి 16 నాటికి ఢిల్లీ సీఎం ఎంపిక !
Selection of Delhi CM by February 16!

ప్రధాని స్వదేశానికి చేరుకున్న తర్వాతే సీఎం ఎంపిక. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి. న్యూఢల్లీ : ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఐదు రోజులైనా Read more

ఓట్లు అడిగే ధైర్యం బీజేపీకి ఎలా వచ్చింది?: కేజ్రీవాల్
ఓట్లు అడిగే ధైర్యం బీజేపీకి ఎలా వచ్చింది?: కేజ్రీవాల్

2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ విడుదల చేసిన సంకల్ప పత్రంలోని హామీలను గుర్తు చేస్తూ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *