Fatal road accident in Saudi Arabia.. 9 Indian citizens killed

ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది భారత పౌరులు మృతి

సౌదీ ఆరేబియా: సౌదీ ఆరేబియా లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది భారత పౌరులు దుర్మరణం పాలయ్యారు. సౌదీ అరేబియా పశ్చిమ ప్రాంతంలోని జిజాన్‌ నగరంలో ఈ ప్రమాదం జరిగింది. జెడ్డా లోని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. బాధిత కుటుంబాలకు తాము అండగా ఉంటామని, స్థానిక అధికారులతో బాధిత కుటుంబాలతో తాము ఘటనపై ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నది.

ప్రమాదంపై బాధిత కుటుంబాలు సమాచారం తెలుసుకోవడం కోసం అక్కడి భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్‌ నెంబర్‌లను కూడా ఏర్పాటు చేసింది. సమాచారం కోసం 8002440003 (Toll free), 0122614093, 0126614276, 0556122301 (WhatsApp) నెంబర్లలో సంప్రదించాలని సూచించింది. కాగా ప్రమాదంపై భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ స్పందించారు. సౌదీ రోడ్డు ప్రమాదంలో భారత పౌరులు ప్రాణాలు కోల్పోయిన వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు.

జెడ్డాలోని రాయబార కార్యాలయంతో తాను మాట్లాడానని, ప్రమాదం గురించి సమాచారం అడిగి తెలుసుకున్నానని విదేశాంగ మంత్రి జైశంకర్‌ చెప్పారు. భారత రాయబార కార్యాలయం బాధిత కుటుంబాలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతోందని అన్నారు. ఈ విషాద పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకు తమ పూర్తి సహకారం ఉంటుందని ఆయన తన అధికారిక ఎక్స్‌ (X) ఖాతాలో పేర్కొన్నారు.

Related Posts
Amit Shah: హిందీ ఏ భాషకూ పోటీ కాదు : అమిత్ షా
Amit Shah హిందీ ఏ భాషకూ పోటీ కాదు అమిత్ షా

Amit Shah: హిందీ ఏ భాషకూ పోటీ కాదు : అమిత్ షా కేంద్ర హోంమంత్రి అమిత్ షా భాషల మధ్య విభేదాలకు తావులేదని స్పష్టం చేశారు. Read more

అదానీపై అమెరికా ఆరోపణలు వ్యూహాత్మక తప్పిదం: ఫోర్బ్స్ నివేదిక
gautam adani

భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికా న్యాయ శాఖ చేసిన నేరారోపణ తీవ్రమైనవని, భౌగోళిక రాజకీయ పరిణామాలతో కూడిన వ్యూహాత్మక తప్పిదమని ప్రముఖ పత్రిక ఫోర్బ్స్ నివేదిక Read more

ఈఆర్సీ చైర్మన్‌గా దేవరాజు నాగార్జున
Devaraju Nagarjuna as ERC C

ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ) చైర్మన్‌గా జస్టిస్ దేవరాజు నాగార్జునను నియమించారు. బుధవారం, జీఎస్టీ కాలనీలో ఈఆర్సీ ప్రధాన కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈఆర్సీ పాలకమండలి Read more

ఆరిజోనాలో రెండు విమానాలు ఢీ, ఇద్దరు మృతి
ఆరిజోనాలో రెండు విమానాలు ఢీ ఇద్దరు మృతి

అగ్రరాజ్యం అమెరికాలో విమాన ప్రమాదాలు తక్షణమే ఆగేలా లేవు. తాజాగా ఆరిజోనా రాష్ట్రంలో రెండు చిన్న విమానాలు ఢీకొని, ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన బుధవారం Read more