vadodara accident :వడోదర కారు బీభత్సం నిందితుడు చెప్పినవన్నీ అబద్ధాలే

వడోదర కారు బీభత్సం ఘటనలో నిందితుడు పోలీసులు ముందు షాకింగ్ కామెంట్లు చేశాడు. ముఖ్యంగా తాను డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మద్యం సేవించలేదని.. హోలికా దహనం కార్యక్రమానికి వెళ్లి వస్తుండగానే ప్రమాదం జరిగినట్లు వివరించాడు. కానీ అతడు చెప్పినవన్నీ అబద్ధాలేనని తెలుస్తోంది. ముఖ్యంగా అతడు ప్రమాదానికి కొన్ని నిమిషాల ముందే స్నేహితుడికి ఇంటికెళ్లగా.. అక్కడే మద్యం సేవిస్తూ సీసీటీవీ కెమెరా కంట పడ్డాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా అంతా షాక్ అవుతున్నారు.

Advertisements
వడోదర కారు బీభత్సం నిందితుడు చెప్పినవన్నీ అబద్ధాలే

రక్షిత్ చౌరాసియా కారు దిగి రచ్చ రచ్చ

గుజరాత్‌లోని వడోదరలో రెండ్రోజుల క్రితం ఓ కారు బీభత్సం సృష్టించగా.. ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడగా ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే నిందితుడు రక్షిత్ చౌరాసియా కారు దిగి రచ్చ రచ్చ చేశాడు. అనదర్ రౌండ్, అనదర్ రౌండ్, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, నిఖితా నిఖితా అంటూ గట్టి గట్టిగా కేకలు వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పటికే నెట్టింట వైరల్ కాగా.. పోలీసులు కూడా నిందితుడిని పట్టుకున్నారు.

షాకింగ్ విషయాలు వెలుగులోకి
ముఖ్యంగా ప్రమాదానికి కొన్ని నిమిషాల ముందు.. రక్షిత్ చౌరాసియా ఎక్కడికి వెళ్లాడు, ఏమేం చేశాడో తెలిసిపోయింది. అందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో కూడా విడుదల కాగా.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదానికి ముందు రక్షిత్ చౌరాసియా తన స్నేహితడితో కలిసి.. మరో స్నేహితుడి ఇంటికి వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయింది. ముందుగా ప్రాంశు కారు డ్రైవ్ చేసేందుకు వెళ్లగా.. రక్షిత్ చౌరాసియా రాగానే అతడు పక్క సీట్లోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత రక్షిత్ చౌరాసియానే కారు నడుపుతూ వచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Related Posts
భారత్-పాకిస్తాన్ ఫ్లాగ్ మీటింగ్ – శాంతి ఒప్పందానికి కొత్త దారి?
భారత్-పాకిస్తాన్ ఫ్లాగ్ మీటింగ్ – శాంతి ఒప్పందానికి కొత్త దారి?

జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి శుక్రవారం భారత్, పాకిస్తాన్ మధ్య బ్రిగేడ్ కమాండర్ స్థాయి ఫ్లాగ్ మీటింగ్ జరిగింది. ఇటీవల జరిగిన Read more

Mahesh Babu: మహేష్ బాబుకు ఈడీ సమన్లు ..27న విచారణకు పిలుపు
మహేష్ బాబుకు ఈడీ సమన్లు ..27న విచారణకు పిలుపు

సౌత్ సూపర్ స్టార్, హీరోయిన్ నమ్రతా శిరోద్కర్ భర్త మహేష్ బాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు​​జారీ చేసింది. ఏప్రిల్ 27న హైదరాబాద్‌లోని ED ఆఫీసులో హాజరు Read more

TamilNadu: తమిళనాడులో మయోన్నైస్ నిషేధం
TamilNadu: తమిళనాడులో మయోన్నైస్ నిషేధం

తమిళనాడు ప్రభుత్వం పచ్చి గుడ్లతో తయారు చేసిన మయోన్నైస్ ను ఒక సంవత్సర కాలం పాటు నిషేధించింది. ఈ నిషేధం ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, అమ్మకం, అన్నింటికీ Read more

ఇస్రో ‘యువ విజ్ఞాని’కి దరఖాస్తుల స్వీకరణ
ISRO accepting applications for 'Young Scientist'

న్యూఢిల్లీ: ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహించే ‘యువ విజ్ఞాని’ కార్యక్రమానికి దరఖాస్తులు కోరుతోంది. శ్రీహరికోటతో పాటు… డెహ్రాదూన్‌ (ఉత్తరాఖండ్‌), తిరువనంతపురం (కేరళ), Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×