Irumudi Success Meet : ఫుల్ జోష్ లో రవితేజ..సక్సెస్ మీట్ లో స్టెప్స్ వేస్తూ సందడి

Follow Us: Google News Daily Hunt
Irumudi Success Meet : ఫుల్ జోష్ లో రవితేజ..సక్సెస్ మీట్ లో స్టెప్స్ వేస్తూ సందడి
FONT SIZE
GET APP

Irumudi Success Meet : ‘మాస్ మహారాజా’ రవితేజ కథానాయకుడిగా నటించిన ‘ఇరుముడి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను ఘనంగా నిర్వహించింది. చాలా కాలం తర్వాత దక్కిన భారీ విజయం కావడంతో రవితేజ ఫుల్ జోష్‌లో కనిపించారు. వేదికపై నవ్వుతూ, ఎంతో ఉత్సాహంగా స్టెప్పులేస్తూ సరికొత్త ఎనర్జీతో చిత్రబృందాన్ని పలకరించారు. రవితేజను ఈ స్థాయిలో ఆనందంగా చూడటం, ఆయన పాత హిట్ చిత్రం ‘ఇడియట్’ నాటి రోజుల జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేసిందని ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : ‘టాక్సిక్’ మేనియా.. టికెట్ ధర రూ. 2,250

Irumudi movie box office collections

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ

శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. తొలి 3 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 80 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. తండ్రీకూతుళ్ల అనుబంధంతో పాటు భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడమే ఈ సినిమా సాధించిన విజయానికి ప్రధాన కారణమని ట్రేడ్ నిపుణులు పేర్కొంటున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు