OG2 : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మోస్ట్ క్రేజీ సీక్వెల్ ప్రాజెక్ట్ ‘ఓజీ-2’ (OG-2) షూటింగ్ వాయిదా పడనుందంటూ గడిచిన కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న వార్తలకు సినీ వర్గాలు చెక్ పెట్టాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ గాయపడటంతో ఆయన కొంతకాలం విశ్రాంతి మోడ్‌లో ఉంటారని, ఈ గ్యాప్‌లో దర్శకుడు సుజీత్ కథానాయకుడు నానితో చేయబోయే సినిమాను మొదలుపెడతారని సామాజిక మాధ్యమాల్లో ఊహాగానాలు షికారు చేశాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని టాలీవుడ్ వర్గాలు స్పష్టం చేశాయి. ముందస్తు ప్రణాళిక ప్రకారమే నవంబర్ మాసం నుంచి ‘ఓజీ-2’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.
Read Also : అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్ విడుదల

నవంబర్లోనే పవన్ ఎంట్రీ: సుజీత్ సుదీర్ఘ ప్రణాళిక సిద్ధం!
ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సీక్వెల్ విషయంలో ఎటువంటి మార్పులు లేవని, పవన్ కళ్యాణ్ కూడా నవంబర్ నుంచి సెట్స్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టమవుతోంది. పొలిటికల్, పర్సనల్ షెడ్యూళ్లను అడ్జస్ట్ చేస్తూనే ఈ సినిమాకు అవసరమైన డేట్లను పవన్ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. సుజీత్ సైతం పవన్ కళ్యాణ్ ఎనర్జీకి తగ్గట్టుగా ప్రీ-ప్రొడక్షన్ పనులను, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సుల ప్లానింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుందని ఆందోళన చెందుతున్న అభిమానులకు ఈ తాజా సమాచారం పెద్ద ఊరటనిచ్చింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :