Mining : వ్యవస్థల తీరుతో కొండలు, గుట్టలు వదిలమేనా?

Follow Us: Google News Daily Hunt
Mining
Mining
FONT SIZE
GET APP

Mining : అడవులను, కొండను, గుట్టలను సృష్టించడానికి ప్రకృతి కి లక్షల సంవత్సరాలు పడుతుంది. దానిని నాశనం చేయడానికి మనిషికి కొన్ని నెలలే చాలు. ఇది కేవలం ఒక భావోద్వేగ వాక్యం కాదు. నేటి భారతదేశంలో అనేక ప్రాం తాల్లో కనిపిస్తున్న వాస్తవం రూపం. ఒకప్పుడు పచ్చదనం తో, అడవులతో, జీవవైవిధ్యంతో కళకళలాడిన కొండలు నేడు క్వారీలుగా, గ్రావెల్ గుంతలుగా, రాతి గనులుగా మారు తున్నాయి. ఇది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు. ఇది రాజ్యాంగ పరిరక్షణ, చట్టాల అమలు, పరిపా లనా పారదర్శకత, అవినీతి నియంత్రణ, ప్రజాస్వామ్య జవాబుదారీతనానికి సంబంధించిన ముఖ్యమైన సమస్య. అసలు ప్రకృతి సంపద ఎవరిది? అని ప్రశ్నించుకుంటే! కొండలు, గుట్టలు, అడవులు, నదులు, చెరువులు ఏ ప్రభు త్వానివి కావు, అవి ప్రజల ఉమ్మడి ఆస్తి, ప్రభుత్వంఏదైనా వాటికి కేవలం సంరక్షలు మాత్రమే. ఈ సూత్రాన్ని భారత న్యాయవ్యవస్థ అనేక సందర్భాల్లో వకా స్త్రీణించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 48ఎ ప్రకారం పర్యావరణం, అడ వులు, వన్యప్రాణులను రక్షించడం రాష్ట్రాల బాధ్యత. ఆర్టికల్ 51ఎ (జి) ప్రకారం ప్రతి పౌరుడు ప్రకృతిని పరిరక్షించడం తన ప్రాథమిక విధిగా భావించాలి.

Read Also : Bhadrachalam Temple : రూ.200 కోట్లతో భద్రాచలం అభివృద్ధి పనులు.. పర్యవేక్షణ లేదంటూ విమర్శలు

Mining
Mining

Mining : అక్రమ తవ్వకా లను నియంత్రించడానికి బలమైన నిబంధనలు

ఆర్టికల్ 21కిందజీవించే హక్కులో పరిశుభ్రమైన పర్యావరణం కూడా భాగమని భారత న్యాయస్థానాలు వివిధ తీర్పులలో వివరణ ఇచ్చా యి. పర్యావరణ రక్షణలో ప్రధానంగా చూస్తే పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, అటవీ సంరక్షణ చట్టం, గనులు ఖని జాల అభివృద్ధి చట్టం, జీవవైవిధ్య చట్టం, నీటి, గాలికాలుష్య నియంత్రణ చట్టాలున్నాయి. ఈ చట్టాలన్నీ అక్రమ తవ్వకా లను నియంత్రించడానికి బలమైన నిబంధనలు కలిగి ఉన్నా యి. అయినా ఎందుకు ఆగడం లేదు? అని ఆలోచిస్తే, లోపం చట్టాలలో కాదు, అమలులో లోపం అని తెలుస్తోంది. దాని లో ప్రధానమైనది ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యం అక్రమతవ్వ కాలు ఒక్కరోజులో జరగవు. భారీ యంత్రాలు, వందలాది లారీలు, పేలుడు పదార్థాలు ఉపయోగిస్తారు. ఇన్ని జరుగు తున్నా సంబంధిత శాఖలకు తెలియకపోవడం నమ్మశక్యంగా లేదు, అదీ కాకుండా ఇప్పుడు ప్రతిగ్రామంలో సచివాల యాలున్నాయి. ఇక అవినీతి అనేది ప్రజల్లో వినిపించే ప్రధాన ఆరోపణ, కొంతమంది అక్రమ వ్యాపారులు, అవినీతి పరులైన అధికారులు కలిసి సహజ వనరులను దోచుకుంటున్నారనేది జగమెరిగిన సత్యం. ఇలాంటి ఆరోప ణలు వచ్చినప్పుడు వాటిపై పారదర్శక విచారణ జరగడం ప్రజావిశ్వాసానికి చాలా అవసరం. అదీ కాకుండా ప్రజలలో అవగాహన లేకపోవడం దౌర్భాగ్యం, తెలియనిది ఏమిటంటే ఆక్రమ మైనింగ్ కనిపిస్తే ఎక్కడ ఫిర్యాదు చేయాలి?ఏ అను మతులు తప్పనిసరి? పర్యావరణ అనుమతి అంటే ఏమిటి? గ్రామసభకు ఉన్న అధికారాలు ఏమిటి? ఈ అవగాహన లేక పోవడమే ఆక్రమార్కులకు అనుకూల వాతావరణాన్ని కల్పి స్తుంది. ఉదాహరణకు ఒక గ్రామం పక్కన ఉన్న కొండను గ్రావెల్ కోసం తవ్వడం ప్రారంభించారు.

పున రుద్ధరణ బాధ్యతలు

మొదట ప్రజలు పట్టించుకోలేదు. కొన్ని నెలల తరువాత కొండ సగం కను మరుగైంది. వర్షాకాలంలో వర్షపు నీరు వేగంగా గ్రామంలోకి వచ్చింది. చెరువు వూడిపోయింది. భూగర్భజలాలుతగ్గాయి, రైతుల బావులు ఎండిపోయాయి. అప్పుడు అందరికీప్రకృతి విలువ తెలిసింది. కొండపోతే ఏమిపోతుంది? అనుకుంటే వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల రీఛార్జ్, జీవ వైవిధ్యం, ఔషధ మొక్కలు, పక్షుల నివాసం, స్థానిక వాతావరణ సమ తుల్యత, భవిష్యత్ తరాల హక్కు మొదలైనవి పోతుంది. మరోపక్క ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నాయి? అని చుస్తే అభివృద్ధి చెందిన అనేక దేశాలు పెద్దఎత్తున తవ్వకాలపై కఠిన పర్యావరణ పరిశీలనలు, ప్రజాభిప్రాయ సేకరణ, పున రుద్ధరణ బాధ్యతలను అమలు చేస్తున్నాయి. అనుమతుల ఉల్లంఘనపై భారీ జరిమానాలు, లైసెన్స్ రద్దు వంటిచర్యలు తీసుకుంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగాతీసు కున్న స్పందన కార్యక్రమం ఈ అక్రమ తవ్వకాలు, రవాణా విషయంలో హాస్యాస్పదంగా మారింది. అంటే ప్రభుత్వం లోని పెద్దలు, అధికారుల తీరు ఏవిధంగా ఉందో తెలుస్తోం ది. దోపిడీదారులకు సహజవనరులు ఆర్థిక వాటాల ద్వారా నిరసనలు తెలియజేయాలి. ఇక్కడ ప్రముఖం గా అధికారుల మధ్య, విభాగాల మధ్య సమన్వయం లేదు, మాకు సంబంధంలేదు అని వెకిలిగా, బాధ్యతారాహిత్యంగా బదులుంటుంది. దానికి ప్రధాన కారణం అధికారంలో ఉన్న బాధ్యతారాహిత్య రాజకీయ నాయకుల అండదండలు, సహ కారం ప్రధానమైనది.

Mining
Mining

దేశ భక్తిని ఆచరణలో చూపించడమే

ఇక ప్రభుత్వాలు డ్రోన్లతో పర్యవేక్షణ, భౌగోళిక సమాచారవ్యవస్థ మ్యాపింగ్, ఆన్లైన్ మైనింగ్ అను మతులు, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్తో ఖనిజ రవాణా పర్య వేక్షణ, అక్రమతవ్వకాలపై వేగవంతమైన ప్రత్యేకన్యాయస్థా నాలు, అవినీతిపరులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకో వాలి. వివిధ విభాగాల్లో ఉన్నప్రభుత్వ అధికారులు సమన్వ యంతో, కలసిపనిచేస్తే నిర్ణయాలు త్వరగా తీసుకునే అవకా శముంది. ప్రకృతి నాశనం నెమ్మదిగా జరుగుతుంది, కానీ దాని ప్రభావం కొన్నితరాలపాటు ఉంటుంది. కొండలు కూలి పోతే తిరిగి నిర్మించలేం, అడవులు నరికితే వెంటనే తిరిగి పెంచలేం, భూగర్భజలాలు తగ్గితే ఒకే ఏడాదిలో నింపలేం, ప్రకృతి సంపదను కాపాడటం అంటే దేశ భక్తిని ఆచరణలో చూపించడమే. చట్టాలను అమలుచేయడం ప్రభుత్వబాధ్యత, వాటిని పర్యవేక్షించడం ప్రజల బాధ్యత. ఈ రెండూ కలిసి నప్పుడే కొండలు, గుట్టలు, అడవులు భవిష్యత్ తరాలకు పదిలంగా ఉంటాయి, లేదంటే భవి ష్యత్తులో మ్యూజియం లలో, ఫోటోలలో చూసుకోవలసిందే. ప్రధానంగాచూస్తే ఇక అవినీతి కుడితినీళ్లు తాగేఅక్రమార్కు లకు అధికారులకు తెలియనిది ఏమిటంటే భవిష్యత్తులో వారి వారసత్వాలు కూడా ప్రకృతివ్రకోపానికి బాధితులుగా మారుతారని తెలియకపోవడమే వారిఅఙ్ఞానానికి నిదర్శనం.

-డాక్టర్ ఎ. భాగ్యరాజ్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు