Afghanistan : అఫ్గాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ ప్రకంపనలు

Read Time:  1 min
Earthquake in Afghanistan.. Tremors in Delhi too
Earthquake in Afghanistan.. Tremors in Delhi too
FONT SIZE
GET APP

Afghanistan : అఫ్గానిస్థాన్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. శనివారం మధ్యాహ్నం అఫ్గానిస్థాన్- తజకిస్థాన్ సరిహ్దదుల్లో భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో, ఉత్తరభారతదేశంలోని పలు చోట్ల స్వల్ప ప్రకంపనలు సంభవించాయి. కశ్మీర్, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకారం, శనివారం మధ్యాహ్నం 12:17 గంటలకు భూమికి 86 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చింది. భూకంప కేంద్రం ఆఫానిస్థాన్-తజకిస్ న్ సరిహద్దు ప్రాంతంలో ఉంది. టెక్టోనిక్ కదలికల కారణంగా భూకంపం వచ్చే ప్రాంతమని అధికారులు పేర్కొన్నారు.

అఫ్గాన్‌లో భూకంపం ఢిల్లీలోనూ ప్రకంపనలు

ఢిల్లీ లోని పలు ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు

కశ్మీర్ వ్యాలీ, ఢిల్లీ లోని పలు ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. దీంతో, ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీస్తున్న విజువల్స్ వైరల్ గా మారాయి. శ్రీనగర్‌కు చెందిన వ్యక్తి మాట్లాడుతూ.. “నేను ఆఫీసులో ఉన్నప్పుడు భూకంపం వచ్చింది. నా చెయిల్ షేక్ అయ్యింది. అయితే, తేలికపాటి ప్రకంపనలు మాత్రమే వచ్చాయి. ఈ ప్రాంతాల్లో భూకంపాలు సాధారణం” అని చెప్పాడు. ఇకపోతే, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ లేదా ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు వెలువడలేదు. మరోవైపు, బుధవారం ఉదయం అఫ్గాన్ లో 5.9 తీవ్రతతో భూకంపం వచ్చింది.

Read Also:  ప్ర‌ధాని మోడీ సౌదీ అరేబియా ప‌ర్య‌ట‌న ఫిక్స్

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.