Ayodhya Donation : అయోధ్య రామాలయ నిర్మాణానికి సేకరించిన విరాళాల చోరీ కేసులో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ విరాళాల దుర్వినియోగం, దొంగతనంపై దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు.. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం (UP GOVT), మరియు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు నోటీసులు పంపింది. దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా సేకరించిన నిధులకు సంబంధించిన వ్యవహారం కావడంతో న్యాయస్థానం దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి ఇప్పటివరకు సాధించిన పురోగతిపై సమగ్రమైన స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పించాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) కోర్టు ఆదేశించింది.
Read Also : జూలై 22న అయోధ్య ట్రస్ట్ కీలక భేటీ.. హిస్టరీలోనే తొలిసారిగా సరికొత్త ‘CEO’ నియామకం!

సిజెఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ.. వచ్చే సోమవారానికి వాయిదా
భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్య కాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లపై లోతైన విచారణ జరిపింది. విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సాలిసిటర్ జనరల్ (SG) తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, ఈ చోరీ వ్యవహారంపై సిట్ దర్యాప్తు అత్యంత వేగంగా కొనసాగుతోందని ధర్మాసనానికి వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ కేసులో సిట్ సమర్పించబోయే నివేదిక ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :