Tirumala: తిరుమల శ్రీవారి సేవలో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు

Follow Us: Google News Daily Hunt
Tirumala
Tirumala
FONT SIZE
GET APP

Tirumala: భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు గురువారం ఉదయం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆమెకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

Read Also: AP Development: కూటమి పాలనలో అభివృద్ధి పరుగులు: మంత్రి బిసి జనార్దన్ రెడ్డి

Tirumala: శ్రీవారి ఆశీస్సులు

వీఐపీ విరామ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్న సింధుకు టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆమెకు వేదాశీర్వచనం చేసి, శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ.. స్వామివారిని దర్శించుకోవడం ఎప్పుడూ ఒక గొప్ప అనుభూతిని ఇస్తుందని అన్నారు.

రాబోయే అంతర్జాతీయ టోర్నమెంట్లలో తాను విజయం సాధించాలని వేంకటేశ్వర స్వామిని మొక్కుకున్నట్లు సింధు తెలిపారు. పీవీ సింధు ఆలయం నుంచి తిరిగి వెళ్తున్న సందర్భంగా పలువురు స్వామివారి భక్తులు ఆమెతో ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు