222

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సర్వం సిద్ధం..

హైదరాబాద్‌: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు రేపు (మంగళవారం)జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని మొత్తం 1.56 కోట్ల మంది ఓటర్లు రేపు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహించనున్నారు.

image

బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఫిబ్రవరి 8న పోలైన ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. మొత్తం ఎన్నికల ప్రక్రియ ఫిబ్రవరి 10 తో ముగియనుంది. ఢిల్లీలోని 70 నియోజకవర్గాల్లో 58 జనరల్ సీట్లు కాగా.. మరో 12 ఎస్సీ రిజర్వ్‌డ్‌ సీట్లు. మొత్తం 1.56 కోట్ల మంది ఓటర్లలో 83.49 లక్షల మంది పురుష ఓటర్లు కాగా.. 71.74 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వారిలో 20 నుంచి 29 ఏళ్ల వయస్సు గల యువ ఓటర్ల సంఖ్య 25.89 లక్షలుగా ఉంది. 18 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల తొలిసారి ఓటేసే వారి సంఖ్య 2.08 లక్షలు.

ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక అవసరాలు ఉన్న (PWD) వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ప్రకటించారు. పీడబ్ల్యూడీ వర్గం నుంచి 79,430 మంది ఓటర్లు ఉన్నారు. ఇక 100 సంవత్సరాలు దాటిన ఓటర్ల సంఖ్య 830 గా ఉంది. 85 ఏళ్ల వయస్సు దాటిన ఓటర్లు 1.09 లక్షల మంది ఉన్నారు. ఢిల్లీలో ట్రాన్స్‌జెండర్ ఓటర్ల సంఖ్య 1,261 గా ఉంది.

Related Posts
ఉత్తర గాజాపై దాడి.. 73 మంది మృతి
Attack on northern Gaza. 7

గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. నిన్న రాత్రి ఉత్తర గాజాపై జరిపిన దాడుల్లో 73 మంది మరణించినట్లు హమాస్ సంస్థ పేర్కొంది. వీరిలో చిన్నారులు, మహిళలు ఉన్నట్లు Read more

ఆస్ట్రేలియాకు వెళ్లిన స్టూడెంట్స్ వీసాలు రద్దు.. ఎందుకంటే?
student visas to Australia

అమెరికాలో విద్యార్థుల కోసం పార్ట్ టైమ్ ఉద్యోగాలకు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే పరిస్థితి ఆస్ట్రేలియాలో కూడా కొనసాగుతోంది. విద్యార్థులు నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ Read more

New Zealand vs Pakistan: మరోసారి ఓటమి పాలైన పాక్
New Zealand vs Pakistan: T20 సిరీస్‌లో పాక్‌కు మరో ఎదురు దెబ్బ

న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు వరుస ఓటములతో కష్టాల్లో పడింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా రెండో టీ20లోనూ పాకిస్తాన్ జట్టు ఓటమి Read more

ఏపీలో కూడా కులగణన చేపట్టాలి : వైఎస్ షర్మిల
Caste census should be conducted in AP too.. YS Sharmila

అమరావతి: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శమని.. ఇదో చారిత్రాత్మక ఘట్టమని.. ఈ సర్వే యావత్ భారతవనికి దిక్సూచి అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ Read more