israel released palestinian prisoners

పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిన ఇజ్రాయెల్‌

జెరూసలేం : హమాస్ ఇజ్రాయెల్‌కు అప్పగించిన ముగ్గురు ఇజ్రాయెలీ బందీలకు బదులుగా దాదాపు 90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేశారు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా 15 నెలల యుద్ధాన్ని ముగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆక్రమిత ప్రాంతంలోని రమల్లాలోని ఓఫర్ జైలు నుంచి సోమవారం తెల్లవారుజామున చాలా మంది ఖైదీలు విడుదలయ్యారు. వెస్ట్ బ్యాంక్పాలస్తీనా మరియు హమాస్ జెండాలను ఊపుతూ వేలాది మంది ప్రజలు సంబరాలు చేసుకున్నారు.

Advertisements
image

ఒప్పందంలో భాగంగా 90మంది పాలస్తీనా ఖైదీలతో కూడిన మొదటి బ్యాచ్ ఇజ్రాయెల్ కస్టడీ నుంచి విడుదలయ్యారు. వారిలో మైనర్లు, మహిళలు ఉన్నారని పాలస్తీనా అధికారులు తెలిపారు. రాళ్లు విసరడం, హత్యాయత్నం వంటి నేరాలకు పాల్పడినందుకు ఇజ్రాయెల్ వీరిని అరెస్టు చేసింది. అయితే, మొదటి దశలో కాల్పుల విరమణ 42రోజుల పాటు కొనసాగుతుంది. ఈ దశలో 33 మంది బందీలు, దాదాపు 2వేల మంది పాలస్తీనా ఖైదీలు దశల వారిగా విడుదలవుతారని భావిస్తున్నారు. ఒప్పందంలో భాగంగా మొదటి దశలో ఇజ్రాయెల్ దళాలు జనావాస ప్రాంతాల నుంచి వైదొలుగుతాయి. అదేవిధంగా గాజాలోకి ఆహారం, నీరు, ఇతర మౌలిక సదుపాయాలను అందించేందుకు ఇజ్రాయెల్ సైన్యం అనుమతిస్తుంది.

రెండో దశలో మిగిలిన బందీలను హమాస్ విడుదల చేస్తుంది. అయితే, రెండో దశ సమయానికి ఇజ్రాయెల్, హమాస్ మధ్య మళ్లీ యుద్ధవాతావరణం నెలకుంటుందా అనే ఆందోళనసైతం వ్యక్తమవుతుంది. హమాస్ ఈ ఒప్పందాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని కోరుకుంటుంది. 2023 అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌ పై హమాస్‌ మెరుపుదాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 1200 మందికి పైగా ఇజ్రాయెల్‌ పౌరులు చనిపోగా, 250 మందిని హమాస్‌ మిలిటెంట్లు బందీలుగా చేసుకున్నారు. దీంతో హమాస్‌పై ఇజ్రాయెల్‌ భీకరంగా విరుచుకుపడింది. గాజాపై ఇజ్రాయెల్‌ చేసిన దాడుల్లో 46,000 మందికిపైగానే పాలస్తానీయులు మృతిచెందారు. అయితే, దాదాపు పదిహేను నెలలుగా సాగుతున్న యుద్ధానికి తాజాగా కాల్పుల విరమణ ఒప్పందంతో తెరపడింది. ఈ ఒప్పందం సుదీర్ఘంగా కొనసాగుతుందా.. అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Related Posts
CM Revanth : సీఎం రేవంత్ కు ఘన స్వాగతం పలికిన జపాన్ మేయర్
revanth japan

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నారు. ఆయనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు కలిసి ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి Read more

Interest rates : వడ్డీ రేట్లు తగ్గించిన 4 బ్యాంకులు
4 banks cut interest rates

Interest rates : ఆర్‌బీఐ రెపో రేటు తగ్గించడంతో బ్యాంకులూ వడ్డీ రేట్ల తగ్గింపునకు సిద్ధమయ్యాయి. ప్రభుత్వ రంగంలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ), ఇండియన్‌ బ్యాంక్‌, Read more

వైసీపీకి అసెంబ్లీకి వెళ్ళే దమ్ములేదు : షర్మిల
YCP does not have guts to go to assembly: Sharmila

సూపర్ సిక్స్ పథకాలపై మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి అమరావతి: కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు సూపర్ Read more

IPL : 2025లో ఖరీదైన ఆటగాళ్ల ఫెయిల్యూర్ షాక్
IPL : 2025లో ఖరీదైన ఆటగాళ్ల ఫెయిల్యూర్ షాక్

IPL : కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన స్టార్ ప్లేయర్ల ఫెయిల్యూర్ – ఫ్యాన్స్‌లో తీవ్ర నిరాశ న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2025 సీజన్ Read more

Advertisements
×