జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో ఉగ్రవాదుల కిరాతక దాడి తరువాత అనూహ్య పరిణామలు ఏర్పడుతున్నాయి. ఈ దాడికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలను తీసుకుంది. ఈ మారణహోమానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణం కావడం వల్ల ఆ దేశంపై కఠిన ఆంక్షలకు దిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ నెల 24వ తేదీన ఏర్పాటైన భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCS) ఈ నిర్ణయాలను తీసుకుంది. అట్టారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్ట్‌ను తక్షణమే మూసివేయాలంటూ ఆదేశించింది. చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లతో భారత్‌కు వచ్చిన, ఇక్కడ నివసిస్తోన్న పాకిస్తానీయులు కూడా తమ స్వదేశానికి వెళ్లిపోవాల్సి ఉంటుందని తెలిపింది.

మే 1 తేదీ లోపలే భారత్‌ను వదలాలి
దీనికి డెడ్ లైన్ కూడా విధించింది సీసీఎస్. మే 1 తేదీ లోపలే వాళ్లంతా కూడా భారత్‌ను వదిలి పాకిస్తాన్‌కు వెళ్లి పోవాల్సి ఉంటుంది. ఈ రాకపోకల కోసం వారికి అందుబాటులో ఉన్న ఒకే ఒక్కటి ఈ అట్టారీ బోర్డర్ చెక్‌పోస్ట్. దీని ద్వారా మాత్రమే అధికారికంగా సరిహద్దు దాటాల్సి ఉంటుంది. గడువు దాటిన తరువాత కూడా ఇక్కడే ఉండే పాకిస్తానీయులకు జైలు శిక్ష తప్పకపోవచ్చు. ఇండస్ రివర్ ట్రీటీనీ కేంద్రం రద్దు చేసింది. పాకిస్తాన్‌తో అన్ని రకాల సంబంధాలను కూడా తెంచేసుకుంది. భారత్‌లో ఉన్న పాకిస్తాన్ హైకమిషనర్‌కు సమన్లు జారీ చేసింది. మే 1వ తేదీ లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.
రక్షణ శాఖ బలబలాలను బేరీజు
యుద్ధానికి దిగాల్సి వస్తే ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయనే అంశం కూడా ప్రస్తావనకు వస్తుందని చెబుతున్నారు. రక్షణ శాఖ బలబలాలను బేరీజు వేస్తారని సమాచారం. దీనిపై ఆ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని ఆధారంగా పాకిస్తాన్‌తో యుద్ధంపై తుది నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.
Read Also: India: ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ పై భారత్ ఆగ్రహం