हिन्दी | Epaper
పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు

మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలను వదిలిన వరంగల్‌ డాక్టర్

Vanipushpa
మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలను వదిలిన వరంగల్‌ డాక్టర్

భార్య వివాహేతర సంబంధానికి భర్త బలైపోయాడు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని సుపారీ ఇచ్చిమరీ భర్తపై ఎటాక్‌ చేయించింది భార్య. వరంగల్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో యువ డాక్టర్ ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రగాయాలతో 8 రోజులుగా మృత్యువుతో పోరాడిన యువ డాక్టర్ శనివారం కన్నుమూశాడు.. గతనెల 20న సుమంత్‌ రెడ్డిపై దాడి జరగగా.. 8 రోజుల నుంచి సుమంత్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.. ఈ క్రమంలో శనివారం డాక్టర్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలను వదిలిన వరంగల్‌ డాక్టర్

విచక్షణారహితంగా దాడి
గతనెల 20న వరంగల్‌ – భట్టుపల్లి ప్రధాన రహదారిపై డాక్టర్‌ సుమంత్‌రెడ్డి కారును అడ్డగించి.. ఇనుప రాడ్లతో ఎటాక్‌ చేశారు ముగ్గురు దుండగులు. కారులో నుంచి కిందకి లాగి విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలతో రోడ్డుపై పడివున్న సుమంత్‌రెడ్డిని గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు స్థానికులు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోన్న సుమంత్‌ని ఆస్పత్రికి తరలించారు పోలీసులు. అయితే, పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటికొచ్చాయి. భార్యే.. సుమంత్‌పై ఎటాక్‌ చేయించిందని తెలుసుకుని అవాక్కయ్యారు.
భార్య ఫ్లోరా, ప్రియుడు శామ్యూల్‌ అరెస్ట్‌
ఈ కేసులో సుమంత్‌రెడ్డి భార్య ఫ్లోరా మరియాతోపాటు ఆమె ప్రియుడు శామ్యూల్‌.. సహకరించిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ రాజ్‌కుమార్‌ను అరెస్ట్‌ చేశారు. దాడి జరిగిన ఐదు రోజుల్లోనే నిందితులను అరెస్ట్‌చేసి రిమాండ్‌కి తరలించారు పోలీసులు. అయితే, భార్యే.. భర్తను దారుణంగా చంపించడం వరంగల్‌లో సంచలనంగా మారింది. సుమంత్‌రెడ్డి – ఫ్లోరా మరియాకు 2016లో పెళ్లయింది.. సంగారెడ్డిలో ఉన్నప్పుడు జిమ్ ట్రైనర్‌ శామ్యూల్‌తో ఫ్లోరా మరియాకి ఏర్పడిన పరిచయం.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. దాంతో, భర్తను అడ్డుతొలగించుకుంటే.. ప్రియుడితో కలిసి ఉండొచ్చని.. సుమంత్‌రెడ్డి మర్డర్‌కి ప్లాన్‌ చేసింది మరియా.
రోడ్డుప్రమాదంగా నాటకం
మర్డర్‌ చేసి రోడ్డుప్రమాదంగా చిత్రీకరించాలని ప్లాన్-A, ప్లాన్-B.. రెడీ చేసుకున్నారు. అయితే, యాక్సిడెంట్ చేసి చంపాలన్న ప్లాన్‌ వర్కవుట్‌ కాకపోవడంతో ప్లాన్‌-B అమలు చేశారు. చివరికి, ఫ్లోరా మరియా.. పాపం పండి ఇప్పుడు జైలు ఊచలు లెక్కబెడుతోంది. మరియాతోపాటు ఆమె ప్రియుడు శామ్యూల్‌, వాళ్లకు సహకరించిన AR హెడ్ కానిస్టేబుల్ రాజ్‌కుమార్‌ను కటకటాల వెనక్కినెట్టారు పోలీసులు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870