हिन्दी | Epaper
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు

Supreme Court: మైనర్‌పై అత్యాచారం..40 ఏళ్ల కు కామాంధుడికి శిక్ష విధించిన సుప్రీం కోర్టు

Vanipushpa
Supreme Court: మైనర్‌పై అత్యాచారం..40 ఏళ్ల కు కామాంధుడికి శిక్ష విధించిన సుప్రీం కోర్టు

ఏదయినా అన్యాయం జరిగితే కొంతకాలం పోరాడి, న్యాయం జరగకపోతే ఇక న్యాయం జరగదని వదిలేస్తాం. కానీ ఓ కుటుంబం మాత్రం కామాంధుడికి శిక్ష పడేంతవరకు పోరాడింది. 40 ఏళ్ల క్రితం ఆమె ఓ చిన్నారి. ఆ సమయంలో ఆమెపై ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కేసు కోర్టుకు వెళ్లింది. ఆ కోర్టు ఈ కోర్టు అంటూ ఆ బాలిక తల్లిదండ్రులు నిందితుడికి శిక్షపడాలని, తమ చిన్నారిపై అత్యాచారం చేసిన వాడికి చట్టం తప్పకుండా శిక్షిస్తుందని, తమకు న్యాయం జరుగుతుందని నమ్మి.. ఏకంగా 40 ఏళ్ల పాటు పోరాటం చేశారు. 1986లో ఓ మైనర్‌పై జరిగిన అత్యాచారం కేసు విషయంలో తాజాగా సుప్రీం కోర్టు తుది తీర్పు వెల్లడించింది. నిందితుడికి శిక్ష విధించాలని ఆదేశించింది.

మైనర్‌పై అత్యాచారం..40 ఏళ్ల కు కామాంధుడికి శిక్ష విధించిన సుప్రీం కోర్టు

కేసు పూర్తి వివరాలు
రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన ఓ బాలికపై 1986లో 21 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడు. నవంబర్ 1987లో ట్రయల్ కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. కానీ, ట్రైయల్‌ కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ నిందితుడు రాజస్థాన్‌ హైకోర్టును ఆశ్రయించాడు. బాధితురాలు తనపై జరిగిన నేరం గురించి ఏమీ చెప్పలేదు. ఈ ఆధారాలతో శిక్ష విధించలేమంటూ రాజస్థాన్‌ హైకోర్టు నిందితుడిని నిర్దోషిగా విడుదల చేసింది. దీంతో బాధితులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
నిర్దోషిగా విడుదల చేసిన తీర్పును పక్కన పెట్టిన కోర్టు
బాధితురాలు మైనర్‌, ఆమె మౌనాన్ని పెద్దల మౌనంతో సమానంగా చూడలేం. తనపై జరిగిన దారుణం నుంచి ఉద్భవించిన మౌనం అయిఉండొచ్చు. మొత్తం ప్రాసిక్యూషన్ భారాన్ని ఆమె చిన్న భుజాలపై మోపడం అన్యాయం” అని న్యాయమూర్తులు అన్నారు. నిందితుడు ఇప్పటికే శిక్ష అనుభవించకపోతే, ట్రయల్ కోర్టు విధించిన శిక్షను అనుభవించడానికి నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870