Hyderabad Road Accident: మితిమీరిన వేగం.. ఐదుగురి ప్రాణాలు బలి

Follow Us: Google News Daily Hunt
Five killed in a single accident.
Five killed in a single accident.
FONT SIZE
GET APP

Hyderabad Road Accident: ఇటీవల రోడ్డు ప్రమాదాలు మితిమీరిపోతున్నాయి. స్పీడ్ డ్రిల్స్, బట్ ఇట్ కిల్స్, నిదానమే ప్రదానం, మీ భద్రత సమాజం, దేశ క్షేమం వంటి ఎన్నో స్లోగన్స్ తో ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు చేస్తూ, ప్రమాదాలను నివారించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ప్రమాదాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. తాజాగా ఓ వ్యక్తి తన స్పోర్ట్స్ బైక్ తో 140 స్పీడ్లో వస్తూ, కారును ఢీకొట్టాడు. దీంతో ఐదుగురు దుర్మరణం చెందారు. ఐదుగురి ప్రాణం తీసిన అతివేగం యాకుబ్ అడ్జల్ (25), వెనుక మరోవ్యక్తితో బైక్ ను వేగంగా డ్రైవ్ చేస్తూ వచ్చాడు. ఎంత వేగం అంటే దాదాపు 140 స్పీడ్తో వస్తూ, ఎదురుగా వస్తున్న ఓ కారును ఢీకొట్టాడు.

Read also: Retired IPS wife murder: పక్కా పథకం ప్రకారమే పనిమనిషిగా చేరి, ఆపై హత్య

Five killed in a single accident.
Five killed in a single accident.

Hyderabad Road Accident: నిర్లక్ష్యపు డ్రైవింగ్ వద్దు

దీంతో కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, బైక్ పై ఉన్న ఇద్దరు స్పాట్ లోను దుర్మరణం చెందారు. కారులో ఉన్న అర్షియబేగం(30), ఉజేప (7), అమర్ (2) మృత్యువాతపడగా, బైక్ నడుపుతున్న బైకర్ యాకుబ్ అప్టల్ (25), అతని వెనుక ఉన్నమరో వ్యక్తి మరణించారు. ఒక నిర్లక్ష్యం ఐదుగురి ప్రాణాలను బలిగొన్నది. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. నిర్లక్ష్యంతో మితిమీరి వేగం, మద్యం మతుల్తో వాహనాలను నడపడం, నిద్రమత్తులో నడపడం వంటి కారణాలతో ఇటీవల ప్రమాదాల సంఖ్య పెరిగిపోతున్నాయి. ప్రత్యేకంగా యువత ఈ ప్రమాదాల్లో అధిక సంఖ్యలో మృత్యువాతపడుతూ కన్నవారికి కడుపుకోతను మిగ్చుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు