Viral Video: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో బీటెక్ విద్యార్థి మృతి

Read Time:  1 min
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో బీటెక్ విద్యార్థి మృతి
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో బీటెక్ విద్యార్థి మృతి
FONT SIZE
GET APP

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో బీటెక్ విద్యార్థి మృతి చెందిన ఘ‌ట‌న తెలంగాణ‌లోని మేడ్చ‌ల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి విన‌య్‌ స్థానిక సీఎంఆర్‌ కాలేజీలో చ‌దువుతున్నాడు. శుక్ర‌వారం సాయంత్రం క‌ళాశాల‌లో నిర్వహించిన క్రికెట్‌ టోర్నమెంట్‌లో తోటి విద్యార్థుల‌తో క‌లిసి పాల్గొన్నాడు. ఈ క్ర‌మంలో క్రికెట్ ఆడుతూ ఒక్క‌సారిగా కుప్పకూలిపోయాడు.

తీవ్ర ఆవేదనకు గురైన తోటి విద్యార్థులు
అది గుర్తించిన విద్యార్థులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే అత‌డు మృతిచెందిన‌ట్టు వైద్యులు నిర్దారించారు. కళ్ల ముందే తమ స్నేహితుడు మృతిచెందడంతో తోటి విద్యార్థులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ‌య్యాయి. ఆ వీడియో ఇప్పుడు బ‌య‌ట‌కు రావ‌డంతో వైర‌ల్‌గా మారింది.

READ ALSO: Hyderabad: ఆ కండక్టర్ కి హయిట్ ఏ శాపం

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.