Congress government debt is over Rs. 1700 crore per day.. Alleti Maheshwar Reddy

Maheshwar Reddy: రోజుకు రూ.1700 కోట్లకుపైగా కాంగ్రెస్‌ సర్కారు అప్పు : ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

Maheshwar Reddy : తెలంగాణ బడ్జెట్‌పై శాసనసభలో చర్చ సందర్భంగా బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడారు. రోజుకు రూ.1700 కోట్లకుపైగా కాంగ్రెస్‌ సర్కారు అప్పు చేస్తోందని విమర్శించారు. తెలంగాణ అప్పు రూ.8.6 లక్షల కోట్లుగా ఉందని అన్నారు. రాష్ట్రంలో ఒక్కో వ్యక్తిపై రుణభారం రూ.2.27 లక్షలుగా ఉంది. పెద్ద ఎత్తున రుణాలుంటే తెలంగాణ ఎలా అభివృద్ధి చెందుతుందో చెప్పాలి. యూపీఏ కంటే ఎన్డీఏ హయాంలో ఆర్థిక సంఘం నిధులు పెరిగాయి.

Advertisements
రోజుకు రూ.1700 కోట్లకు పైగా

నిమిషానికి రూ.కోటికిపైగా కాంగ్రెస్‌ అప్పులు

యూపీఏ హయాంలో రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో 32 శాతం వాటా ఉండేది. అప్పుడు కేంద్ర పన్నుల్లో వాటా 2-3 శాతం కూడా పెంచలేదు. మోడీ ప్రభుత్వం వచ్చాక కేంద్ర పన్నుల్లో వాటా 10 శాతం పెంచి 42 శాతం చేశారు. పన్నుల్లో వాటా పెంచాక కూడా కేంద్రాన్ని విమర్శించడం సరికాదు అని ఆయన అన్నారు. నిమిషానికి రూ.కోటికిపైగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్పులు చేస్తోందన్నారు.

ఆదాయం చరానా.. అప్పు బరానా

ఈ రాష్ట్రాన్ని దివాలా తీసేలా బడ్జెట్ పెట్టారు అని మండిపడ్డారు. ఆదాయం చరానా.. అప్పు బరానా అన్నట్లు ఉంది. బడ్జెట్ నిండా అప్పులే ఉన్నాయి. రాష్ట్ర అప్పులు మరింత పెరిగే సూచికగా ఉంది. ఇన్ని రకాలుగా అప్పులు చేసిన ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ఈ సారి కూడా నిరుద్యోగులకు మొండి చేయి చూపిస్తారని అర్థం అయ్యింది. మహిళలకు ఇస్తామన్న హామీలు ఎందుకు పొందు పర్చలేదో చెప్పాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Related Posts
ఉక్రెయిన్ కు అమెరికా సైనిక సహాయం నిలిపివేత
US suspends military aid to

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌కు అందిస్తున్న సైనిక సహాయాన్ని నిలిపివేసినట్లు ప్రకటించారు. ఈ Read more

రజనీకాంత్ ‘జైలర్ 2’ సీక్వెల్?
రజనీకాంత్ 'జైలర్ 2' సీక్వెల్?

రజనీకాంత్ ‘జైలర్’ సూపర్ హిట్ తర్వాత, దాని సీక్వెల్‌పై ఆతృత నెలకొంది. ఈ సీక్వెల్‌ను దర్శకుడు నెల్సన్ ధృవీకరించారు, ఇందులో రజనీకాంత్ తన ప్రసిద్ధ పాత్ర ముత్తువెల్ Read more

Hyderabad: ఆ కండక్టర్ కి హయిట్ ఏ శాపం
Hyderabad: ఆ కండక్టర్ కి హయిట్ ఏ శాపం

సాధారణంగా మనుషుల ఎత్తు, బరువుల మధ్య వ్యత్యాసం చాలా ఉంటుంది. కొంతమంది చూడ్డానికి చాలా పొట్టిగా ఉంటారు. మరికొందరు చూస్తే ఏకంగా ఆజానుభావుడిలా కనిపిస్తారు. ఏడెనిమిది అడుగుల Read more

Electrical Workers Problems : విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం – మంత్రి గొట్టిపాటి రవి
విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం - మంత్రి గొట్టిపాటి రవి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యుత్ శాఖ గత ప్రభుత్వ హయాంలో ఎదుర్కొన్న కష్టాలను అధిగమిస్తూ, వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×