CM Revanth Reddy to leave for Delhi this afternoon

CM Revanth Reddy: నేడు మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్‌ పెద్దలకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో పాటు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీకి పయనం కానున్నారని సమాచారం. పార్టీ కీలకనేత కేసీ వేణుగోపాల్‌తో తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు సాయంత్రం భేటీకానున్నారు. ఈరోజు, రేపు ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు పార్టీ పెద్దలతో పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. వీరు ఢిల్లీకి వెళ్తారన్న సమాచారం రాగానే మరోసారి తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశం తెరపైకి వచ్చింది.

Advertisements
image

కేబినెట్ విస్తరణతో పాటు రెండో విడత నామినేటెడ్ పోస్టులపై

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం, ఎస్సీల రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ అంశాలపై కాంగ్రెస్ పెద్దలతో చర్చించనున్నారు. మరోవైపు నియోజకవర్గాల పునర్ విభజనపై ఇటీవల చెన్నైలో జరిగిన సమావేశానికి సంబంధించి రేవంత్ రెడ్డితో చర్చిస్తారని సమాచారం. దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ ద్వారా కలిగే నష్టం, రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే దానిపై చర్చించారు. చెన్నై సదస్సులో తీర్మానాలతో పాటు దక్షిణాదిన డీలిమిటేషన్ పై జరుగుతున్న గందరగోళాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర కేబినెట్ విస్తరణతో పాటు రెండో విడత నామినేటెడ్ పోస్టులపై ఢిల్లీ పెద్దలతో రేవంత్ రెడ్డి, భట్టి మంతనాలు జరుపుతారని కాంగ్రెస్ వర్గాల సమాచారం.

Related Posts
హర్షసాయిపై బాధితురాలు మరో ఫిర్యాదు
harshasai

AP: తనను యూట్యూబర్ హర్షసాయి మోసం చేశాడని ఫిర్యాదు చేసిన యువతి మరోసారి నార్సింగి పోలీసులను ఆశ్రయించారు. పెళ్లి పేరుతో హర్ష సాయి, అతడి కుటుంబం తనను Read more

జగన్ పాలనలో వెలువడిన చీకటి జీవోలుకాదు కూటమి ప్రభుత్వానివి: లోకేశ్‌
Nara Lokesh Sensational Comments ON YS Jagan

అమరావతి: ఇకనైనా జగన్‌ తప్పుడు ప్రచారాలు మానుకోవాలని మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ఈమేరకు ఆయన 'ఎక్స్‌'లో పోస్టు చేశారు. ''వరద బాధితులకు ఇస్తామన్న రూ.కోటిలో ఒక్క Read more

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 6 విమానాలకు బాంబు బెదిరింపులు..
Bomb threats to 6 planes at Shamshabad Airport

హైదరాబాద్‌: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 6 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం అందింది. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై, విమానాశ్రయంలో కఠినమైన తనిఖీలను ప్రారంభించారు. మంగళవారం దేశంలోని Read more

తెలంగాణకు తీరప్రాంతం లేని లోటును పూడ్చుతాం – సీఎం రేవంత్
cm revanth davos

తెలంగాణ రాష్ట్రానికి తీరప్రాంతం లేకపోవడంతో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు మచిలీపట్నం పోర్టును ప్రత్యేక రోడ్డు, రైలు మార్గాలతో అనుసంధానం చేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *