CM Revanth Reddy meet with Rahul Gandhi..!

రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!

టెన్ జన్‌పథ్‌లో పార్టీ అగ్రనేతను కలిసిన రేవంత్ రెడ్డి

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. శనివారం మధ్యాహ్నం సోనియాగాంధీ అధికారిక నివాసం 10 జెన్‌పథ్‌లో రాహుల్‌ గాంధీని రేవంత్‌ రెడ్డి కలిశారు. చాలాకాలం తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రికి కాంగ్రెస్‌ అగ్రనేత అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన, ఎస్సీ వర్గీకరణ గురించి రాహుల్‌ కు రేవంత్‌ వివరించినట్టు సమాచారం.

Advertisements
రాహుల్ గాంధీ సీఎం రేవంత్

సూర్యాపేట సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించిన రేవంత్ రెడ్డి

త్వరలో సూర్యాపేట, మెదక్‌ లో నిర్వహించే భారీ బహిరంగ సభల్లో ఏదో ఒక సభకు హాజరుకావాలని రాహుల్‌ గాంధీని ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. శుక్రవారం రాత్రే ఢిల్లీకి చేరుకున్న రేవంత్‌ రెడ్డి శనివారం ఉదయం రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ ఎంపీలతో కలిసి 10 జెన్‌పథ్‌ కు వెళ్లారు. రాహుల్‌ తో సమావేశం సందర్బంగా కేబినెట్‌ విస్తరణ, పీసీసీ కార్యవర్గం నియామకం, నామినేటెడ్‌ పదవుల భర్తీ, స్థానిక సంస్థల ఎన్నికలు సహా పలు అంశాల గురించి చర్చించనట్టుగా ఊహాగానాలు సాగుతున్నాయి.

తెలంగాణలోని రాజకీయ పరిస్థితులపై చర్చ

మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం భేటీ అయ్యే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణ అమలు పై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఏప్రిల్ లో గద్వాల్ లేదా మెదక్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామన్నారు.

Related Posts
Gutta Jwala: పండంటి ఆడ‌బిడ్డకు జ‌న్మ‌నిచ్చిన గుత్తా జ్వాల
Gutta Jwala: పండంటి ఆడ‌బిడ్డకు జ‌న్మ‌నిచ్చిన గుత్తా జ్వాల

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్ ఈ జంటకు పండంటి ఆడపిల్ల జన్మించిందని వారు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ Read more

ఢిల్లీలో ప్రమాదకరస్థాయిలో వాయుకాలుష్యం..ఏక్యూఐ 500
Dangerous level of air pollution in Delhi.AQI 500

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) గత ఏడు రోజులుగా ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. మంగళవారం ఉదయం ఆనంద్‌ విహార్‌తో సహా ఢిల్లీలోని Read more

ప్రపంచ అంగవైకల్యం దినోత్సవం..
World Prematurity Day

ప్రతి సంవత్సరం నవంబర్ 17న ప్రపంచ అంగవైకల్యం దినోత్సవం (World Prematurity Day) జరుపుకుంటాం. ఈ రోజు, మార్చ్ ఆఫ్ డైమ్ (March of Dimes) సంస్థ Read more

Bhumana Karunakar Reddy: నాపై వంద కేసులు పెట్టుకున్నాభయపడను:  భూమన
Bhumana : నాపై వంద కేసులు పెట్టినా భయపడను – భూమన కరుణాకర్ రెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గోశాలలో వందకు పైగా గోవులు చనిపోయాయని సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారంపై రాజకీయాల వేడి రగిలింది. ఈ ఘటనలో అసత్య ప్రచారం Read more

Advertisements
×